AP Speaker Sitaram : గీత దాటితే చర్యలు తప్పవు
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం
AP Speaker Sitaram : ఎవరైనా సరే సభా మర్యాదలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఉద్రిక్తంగా మారాయి. చివరకు తోపులాటకు దారి తీసింది.
ఒకరిపై మరొకరు కొట్టుకునేంత దాకా వెళ్లడంతో మధ్యాహ్నానికి వాయిదా వేశారు స్పీకర్. ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు తమ్మినేని సీతారాం(AP Speaker Sitaram). ఇక నుంచి ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు. సభ్యులకు కొన్ని రూల్స్ ఉంటాయని, వాటిని గనుక అతిక్రమిస్తే ఇక నుంచి చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రతిసారి అడ్డుకోవడం ప్రతిపక్షాలకు రివాజుగా మారిందని మండిపడ్డారు. తాను అటు అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షానికి కూడా సమాన అవకాశాలు ఇస్తున్నానని అన్నారు. కానీ విపక్ష సభ్యులు తమ స్థాయి మరిచి మాట్లాడటం, ఆపై పోడియం వద్దకు రావడం, పేపర్లు చించి వేయడం మంచి పద్దతి కాదన్నారు. సభను సజావుగా నడిపించడమే తన కర్తవ్యమని స్పష్టం చేశారు స్పీకర్. ఇదే సమయంలో సభా మర్యాదను పాటించడం అన్నది ముఖ్యమన్నారు.
ఆ మాత్రం తెలుసు కోకుండా ఇలా ప్రవర్తించడం మంచిది కాదని పేర్కొన్నారు. ప్రతి నిమిషం ప్రజా ధనం ఖర్చు అవుతుందన్న సోయి సభ్యులకు ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు తమ్మినేని సీతారాం(AP Speaker). ప్రివిలైజ్ కమిటీకి వీరిపై చర్యలు తీసుకోవాలని అధికార పార్టీకి చెందిన మంత్రులు కోరవడంతో స్పీకర్ ఓకే చెప్పారు. తనపై తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి దాడి చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. తనపై కక్ష కట్టారంటూ వాపోయారు.
Also Read : కొనసాగుతున్న కవిత విచారణ