AP Speaker : టీడీపీ స‌భ్యుల‌పై స్పీక‌ర్ సీరియ‌స్

స‌భా మ‌ర్యాద‌లు పాటించ‌డం లేదు

AP Speaker : టీడీపీ స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న‌పై ఏపీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం (AP Speaker)సీరియ‌స్ అయ్యారు. స‌భా మ‌ర్యాద‌ల‌ను పాటించ‌డం లేద‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌జా ప్ర‌తినిధులు స‌మ‌స్య‌ల‌ను, ప్ర‌ధాన అంశాల‌ను ప్ర‌స్తావించ‌కుండా అడ్డు కోవ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

ఇలా ప‌లుసార్లు సూచించినా వారి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాక పోవ‌డం బాధ‌ను క‌లిగిస్తోంద‌న్నారు. అందుకే స‌భ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేశారు స్పీక‌ర్.

చిడ‌త‌లు వాయిస్తూ స‌భా కార్య‌క‌లాపాల‌కు ప‌దే ప‌దే ఆటంకం క‌లిగించ‌డం వ‌ల్ల స‌భ స‌జావుగా సాగ‌ద‌న్నారు. దీంతో సభ్యుల‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేయాల్సి వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేశారు స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం.

విలువైన స‌భా స‌మ‌యాన్ని వృధా చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఒక్క రోజుకు శాస‌న స‌భ నిర్వ‌హణ కోసం ప్ర‌భుత్వం రూ. 53.28 ల‌క్ష‌లు ఖ‌ర్చువుతుంద‌ని వెల్ల‌డంచారు.

అంతే కాదు ఒక నిమిషం స‌భ నిర్వ‌హ‌ణ‌కు గాను రూ. 88 వేల 802 రూపాయ‌లు అవుతుంద‌ని, ఇదంతా ప్ర‌జా ధ‌నం అని టీడీపీ స‌భ్యులు గుర్తించాల‌ని సూచించారు.

ఇలా నిరుప‌యోగం చేయ‌డాన్ని తాను స‌హించబోనంటూ హెచ్చ‌రించారు ఏపీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం(AP Speaker).

ఇప్ప‌టికే ప‌లుమార్లు టీడీపీ స‌భ్యుల‌ను స‌స్పెన్స్ చేసినా బుద్ది రాలేద‌ని సీరియ‌స్ అయ్యారు. కావాల‌ని స‌భ‌కు ఆటంకం క‌లిగించ‌డం ఇది ఏ ర‌క‌మైన ప‌ద్ద‌తి అని ప్ర‌శ్నించారు.

ఏపీ అసెంబ్లీలో పెగాస‌స్ స్పైవేర్ ఒక్క‌సారిగా కుదిపేసింది. ఈ అంశంపై స్వ‌ల్ప కాలిక చ‌ర్చ‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చారు స్పీక‌ర్ త‌మ్మినేని సీతారం.

Also Read : మ‌హిళ‌ల కోసం దిశ వాహ‌నాలు ప్రారంభం

Leave A Reply

Your Email Id will not be published!