AP SSC Results 2022 : ఏపీ ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాలు విడుదల
రిలీజ్ చేసిన విద్యా శాఖ మంత్రి బొత్స
AP SSC Results 2022 : అనుకున్న విధంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరీక్షా ఫలితాలను విడుదల చేయడంలో ముందంజలో ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం కంటే పదో తరగతి(AP SSC Results 2022) పరీక్షలు నిర్వహించింది.
ఈ మేరకు సోమవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల చేశారు. ఈసారి కొత్తగా మార్కుల రూపంలో ఫలితాలను ప్రకటించడం విశేషం.
ఏపీ విద్యా శాఖలో ఇది ఓ రికార్డుగా భావించాలి. ఎందుకంటే రికార్డు స్థాయిలో ఎస్ఎస్సీకి సంబంధించి తుది ఫలితాలను విడుదల(AP SSC Results 2022) చేసింది విద్యా శాఖ. 4,14,281 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు.
67.26 శాతం ఉత్తీర్ణ పొందారు. ఇదిలా ఉండగా పదో తరగతి పరీక్షల్లో ఈసారి బాలికలు పై చేయి సాధించారు. ఇక జిల్లాల వారీగా చూస్తే 78.3 శాతంతో ప్రకాశం జిల్లా ఏపీ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది.
ఇక 49.7 శాతంతో అనంతపురం జిల్లా ఆఖరు స్థానంతో సరి పెట్టుకుంది. ఇక పరీక్షల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏప్రిల్ 27వ తేదీన ప్రారంభం అయ్యాయి.
మే 9వ తేదీతో పూర్తయ్యాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలను 6,22,537 మంది రాశారు. యుద్ధ ప్రాతిపదికన ఎస్ఎస్సీ బోర్డు చర్యలు తీసుకుంది.
ఏకంగా పరీక్షల మూల్యాంకనం కోసం 20 వేల మంది టీచర్లను ఏర్పాటు చేసింది. పరీక్ష ఫలితాలకు సంబంధించి ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయడం జరిగిందని విద్యా శాఖ తెలిపింది.
ఇదిలా ఉండగా పరీక్షల ఫలితాలను విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. టీచర్లను, విద్యా శాఖను అభినందించారు. ఉత్తీర్ఱులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలి – కేటీఆర్