AP CM : సుప‌రిపాల‌న‌లో జ‌గ‌న్ కు జేజేలు

వ‌రుస‌గా రెండోసారి నెంబ‌ర్ 1

AP CM : యువ నాయ‌కుడు ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్ర‌భుత్వం అరుదైన ఘ‌న‌త‌ను స్వంతం చేసుకుంది. వ‌రుస‌గా రెండో సారి దేశంలోనే టాప్ లో నిలిచింది సుప‌రిపాల‌న‌లో.

దేశంలో ఎక్క‌డా లేని రీతిలో సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టారు సీఎం(AP CM). అప్పులు చేసిన‌ప్ప‌టికీ అభివృద్ధే ధ్యేయంగా ప‌ని చేస్తున్నారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టు కోవ‌డంలో స‌క్సెస్ అయ్యారు.

అంతే కాకుండా పాల‌నా ప‌రంగా ప‌లు సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. గ్రామీణ స్థాయి వ‌ర‌కు తీసుకు వెళ్లారు. పూర్తి పార‌ద‌ర్శ‌క‌త ఉండేలా చేశారు. తాజాగా ఈ ఏడాది ఉగాది నుంచి కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజ‌న్లు ఏర్పాటు కానున్నాయి.

ప్ర‌జ‌ల‌కు మ‌రింత మెరుగైన రీతిలో పాల‌న అందించేందుకే వీటిని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు జ‌గ‌న్ రెడ్డి. ఆయ‌న సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే విద్య‌, వైద్యం, ఉపాధి, ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు, ఐటీ, వ్య‌వ‌సాయం, మ‌హిళా సాధికార‌త‌కు ప్రాధాన్య‌త ఇస్తాన‌ని జ‌నం సాక్షిగా ప్ర‌క‌టించారు.

దానినే అమ‌లు చేస్తున్నారు. దీంతో ఆశించిన దాని కంటే మెరుగైన ఫ‌లితాల‌ను అందుకుంటోంది ఏపీ రాష్ట్రం. స్కోచ్ ప్ర‌తి ఏటా ఏయే రాష్ట్రం ఎలా పాల‌న సాగిస్తుంద‌నే దానిపై స‌ర్వే చేప‌డుతుంది.

ఈసారి కూడా చేప‌ట్టిన స‌ర్వేలో ఏపీ టాప్ లో నిలిచింది. రెండో స్థానంలో ప‌శ్చిమ బెంగాల్ , ఆ త‌ర్వాతి స్థానాల్లో ఒడిశా, గుజ‌రాత్, మ‌హారాష్ట్ర , తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.

గ్రామీణాభివృద్ధి, శాంతి భ‌ద్ర‌త‌లు, జిల్లా ప‌రిపాల‌న‌, వ్య‌వ‌సాయ విభాగాల్లో తొలి స్థానాలు అందుకుంది ఏపీ. ఈ గ‌వ‌ర్నెన్స్ లో రెండో స్థానంలో , ర‌వాణా రంగంలో మూడో ప్లేస్ ద‌క్కించుకుంది.

Also Read : స్కిప్ప‌ర్ ర‌షీద్ కు ప‌వ‌ర్ స్టార్ సాయం

Leave A Reply

Your Email Id will not be published!