AP Trains Stop : ఆంధ్ర ప్రదేశ్ – ఏపీ(AP)లో ప్యాసింజర్ ను ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొన్న ఘటనలో పలువురు మరణించారు. పెద్ద ఎత్తున ప్రయాణీకులు గాయపడ్డారు. మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే సీఎం జగన్ రెడ్డి ఆదేశించారు. రైల్వే శాఖ అప్రమత్తమైంది. పలు రైళ్లను రద్దు చేసింది, మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఇప్పటి వరకు 14 రైళ్లను రద్దు చేయగా, 5 రైళ్లను దారి మళ్లించింది. తాజాగా మరో 8 రైళ్లను రద్దు చేసినట్లు తాజాగా ప్రకటించింది రైల్వే శాఖ .
AP Trains Stop Trains Canceled
ఇక రద్దు చేసిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఆయా రైల్వే స్టేషన్ల నుంచి బయలు దేరాల్సిన రైళ్లలో ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. 22819 నెంబర్ కలిగిన భువనేశ్వర్ నుంచి విశాఖ కు బయలు దేరాల్సిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ను రద్దు చేసింది. 22820 నెంబర్ కలిగిన విశాఖ నుంచి భువనేశ్వర్ కు వళ్లాల్సిన ట్రైన్ ను రద్దు చేశారు.
07470 నెంబర్ కలిగిన విశాఖ నుంచి పలాస వెళ్లాల్సిన ప్యాసింజర్ , 07471 నెంబర్ కలిగిన పలాస నుంచి వైజాగ్ కు బయలు దేరాల్సిన ప్యాసింజర్ ట్రైన్లను నిలిపి వేసినట్లు పేర్కొంది రైల్వే శాఖ. అంతే కాకుండా 08583 నెంబర్ కలిగిన విశాఖపట్నం నుంచి తిరుపతికి బయలు దేరాల్సిన వీక్లీ స్పెషల్ , 18535 నెంబర్ కలిగిన బ్రహ్మాపూర్ నుంచి వైజాగ్ కు వెళ్లే ఎక్స్ ప్రెస్ ను రద్దు చేసినట్లు ప్రకటించింది.
అంతే కాకుండా 18526 నెంబర్ కలిగిన విశాఖ నుంచి బ్రహ్మాపూర్ కు వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలుతో పాటు , 31న తిరుపతి నుంచి విశాఖపట్టణంకు బయలు దేరాల్సిన 08584 నెంబర్ కలిగిన ట్రైన్ ను కూడా నిలిపి వేసినట్లు తెలిపింది రైల్వే శాఖ. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 27 రైళ్లను రద్దు చేసింది.
Also Read : MLC Kavitha : ఆక్స్ ఫర్డ్ లో ప్రసంగించనున్న కవిత