APCC Protest : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఒప్పుకోం
ఏపీపీసీసీ ఆధ్వర్యంలో ఆందోళన
APCC Protest : ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో శనివారం విశాఖపట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దానిని ప్రైవేటీకరించాలనే ఆలోచనను, ప్రయత్నాలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు గిడుగు రుద్రరాజు.
APCC Protest Rally
కేంద్రంలోని మోదీ బీజేపీ ప్రభుత్వం పనిగట్టుకుని ప్రభుత్వ రంగ సంస్థలను గంప గుత్తగా ప్రైవేటీకరణ చేస్తోందంటూ ఆరోపించారు. దీనిని మొదటి నుంచి కాంగ్రెస్(Congress) పార్టీ తప్పు పడుతూ, నిలదీస్తూ వస్తోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ ప్లాంట్ లో పని చేస్తున్న ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.
వీరికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఏపీసీసీ. కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలపై నిలదీస్తుందన్నారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు మేలు చేయాలే తప్పా మోసం చేయడం మంచి పద్దతి కాదన్నారు. రాష్ట్ర సర్కార్ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు.
ఎందరో ప్రాణ త్యాగం చేసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిందని, నష్టాల్లో ఉందనే సాకు చూపి కేంద్రం గంపగుత్తగా తమ వారికి అప్పగించే యోచనలో ఉందంటూ మండిపడ్డారు ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు.
Also Read : CM Ashok Gehlot : మోదీ మౌనం అశోక్ గెహ్లాట్ ఆగ్రహం