Harbhajan Singh : ఎవరూ ఊహించని రీతిలో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) రాజ్యసభకు ఐదుగురిని నామినేట్ చేసింది. తాజాగా పంజాబ్ లో జరిగిన ఎన్నికల్లో 92 సీట్లు సాధించి దుమ్ము రేపి పవర్ లోకి వచ్చింది.
యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా పేరొందిన భగవంత్ మాన్ (Bhagwant Mann) కు సీఎంగా ఛాన్స్ ఇచ్చారు ఆప్ జాతీయ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
ఈ సందర్భంగా ఐదు సీట్లు రాజ్యసభలో పెరిగాయి. దీంతో ముందు నుంచీ అనుకున్నట్లే ఆప్ సీఎం తన చిరకాల మిత్రుడు, సోదరుడిగా భావించే ప్రముఖ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ వైపు మొగ్గు చూపారు.
అయితే రాజ్యసభ సీటు లేదంటే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా త్వరలో రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే స్పోర్ట్స్ యూనివర్శిటీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. అనుకున్నట్లుగానే భజ్జీకి రాజ్యసభ సీటు కన్ ఫర్మ్ అయ్యింది.
మిగతా వారితో పాటు హర్బజన్ సింగ్ తన మిత్రుడు భగవంత్ మాన్ (Bhagwant Mann) తో కలిసి రాజ్యసభ ఆప్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడాడు హర్భజన్ సింగ్(Harbhajan Singh).
ఈ సందర్భంగా తాను సోదరుడిగా భావించే సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) కు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని చెప్పాడు. అంతే కాదు తనపై నమ్మకం ఉంచిన ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కూడా కృతజ్ఞతలు.
ఇది నా ఒక్కడికి దక్కిన ఛాన్స్ కాదు. పంజాబ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా యూత్ కు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడు. జీవితంలో ఎక్కువ కాలం మైదానంలో ఉన్నానని ఇక నుంచి ప్రజా జీవితంలోకి రాబోతున్నట్లు తెలిపాడు.
Also Read : బండబడ గ్యాస్ గుదిబండ