Apple CEO Tim Cook : మోదీతో భేటీకి టిమ్ కుక్ ఆస‌క్తి

భార‌త దేశంలో యాపిల్ స్టోర్లు

Apple CEO Tim Cook : ప్ర‌పంచంలోనే మొబైల్స్ తయారీలో టాప్ లో కొన‌సాగుతోంది యాపిల్. స‌ద‌రు సంస్థ‌కు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ టిమ్ కుక్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని క‌ల‌వాల‌ని అనుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు.

భార‌త దేశంలో యాపిల్ స్టోర్ల‌ను తెరిచేందుకు ప్లాన్ చేశారు. ఇప్ప‌టికే ఏర్పాట్లు కూడా పూర్త‌య్యాయి. దేశ ఆర్థిక‌, రాజ‌కీయ రాజ‌ధానులుగా పేరొందిన ముంబై, ఢిల్లీలో యాపిల్ స్టోర్ల‌ను ప్రారంభించే ఛాన్స్ ఉంది. జంట అవుట్ లెట్ ల ప్రారంభోత్స‌వానికి టిమ్ కుక్ అధ్య‌క్ష‌త వ‌హించనున్నారు.

ముంబై లోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని ఉన్న‌త స్థాయి మాల్ లో యాపిల్ మొట్ట మొద‌టి ఇండియా స్టోర్ ను ప్రారంభించ‌బోతున్నారు. ఐఫోన్ త‌యారీదారు మొద‌టి స్టోర్ ను తెరించేందుకు గాను త‌న ప‌ర్య‌ట‌న‌ను షెడ్యూల్ కూడా చేశారు. ఏప్రిల్ 18న ముంబైలో , 20న న్యూ ఢిల్లీలో మ‌రో యాపిల్ స్టోర్ ను ప్రారంభిస్తార‌ని యాపిల్ కంపెనీ మంగ‌ళ‌వారం అధికారికంగా వెల్ల‌డించింది.

2016లో యాపిల్ సిఇఓ(Apple CEO Tim Cook) తొలిసారి భార‌త్ ను సంద‌ర్శించారు. అనంత‌రం ఏడు సంవ‌త్స‌రాల త‌ర్వాత ఈ టూర్ ఖ‌రారైంది. ప్ర‌పంచంలోని అత్యంత విలువైన కంపెనీల‌లో యాపిల్ ఒక‌టి. ఇక భార‌త దేశానికి సంబంధించి ఐ ఫోన్ ల విక్ర‌యాలు ఆల్ టైమ్ కి చేరుకున్నాయి. బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకుంది.

Also Read : కేటీఆర్ తో ఆదిత్యా ఠాక్రే ముచ్చ‌ట‌

Leave A Reply

Your Email Id will not be published!