Asmi Jain : యాపిల్ ఛాలెంజ్ అస్మీ జైన్ విన్న‌ర్

ఇండోర్ కు చెందిన 20 ఏళ్ల డెవ‌ల‌పర్

Asmi Jain : భార‌త దేశానికి చెందిన డెవ‌ల‌ప‌ర్ సంచ‌ల‌నం సృస్టించింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఇండోర్ కు చెందిన విద్యార్థిని అస్మీ జైన్(Asmi Jain) అరుదైన ఘ‌న‌త సాధించింది. ప్ర‌పంచంలో దిగ్గ‌జ సంస్థ‌గా పేరు పొందిన మొబైల్ కంపెనీ యాపిల్ ప్ర‌పంచ వ్యాప్తంగా స్విప్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ పేరుతో పోటీని నిర్వ‌హించింది. ఇందులో ముగ్గురిని ఎంపిక చేసింది దిగ్గ‌జ సంస్థ ఆపిల్. వీరిలో అస్మీ జైన్ ఒక‌రు ఉండ‌డం విశేషం.

త‌న యాప్ ప్లే గ్రౌండ్ ను వివిధ ర‌కాల కంటి ప‌రిస్థితులు, గాయాలు ఉన్న వ్య‌క్తులు ఉప‌యోగించ వ‌చ్చ‌ని భావిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా అస్మీ జైన్ ప్ర‌స్తుతం ఇండోర్ లోని మెడి – క్యాప్స్ విశ్వ విద్యాల‌యంలో చ‌దువుకుంటున్నారు. ఆమెకు 20 ఏళ్లు.

ఆపిల్ వార్షిక డెవ‌ల‌ప‌ర్ కాన్ఫ‌రెన్స్ (డ‌బ్ల్యూడ‌బ్ల్యూడీసీ) కి ముందు యాపిల్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల‌కు స్విఫ్ట్ కోడింగ్ లాంగ్వేజ్ ని ఉప‌యోగించి అస‌లైన యాప్ ప్లే గ్రౌండ్ ను రూపొందించేందుకు స‌వాల్ ను విసిరింది. ఈ ఏడాది నిర్వ‌హించిన ఈ కీల‌క పోటీలో ముగ్గురిని ఎంపిక చేసింది యాపిల్. విజేత‌ల‌లో అస్మీ జైన్ ఎంపికైంది. హెల్త్ కేర్ రంగంలో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు త‌న కోడింగ్ నైపుణ్యాల‌ను ఉప‌యోగించార‌ని యాపిల్ ప్ర‌క‌టించింది.

ఈ 20 ఏళ్ల యువ‌తి కోడింగ్ కోసం త‌న ప్రేర‌ణ ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగంలో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌నే ఆలోచ‌న నుండి వ‌చ్చింద‌ని చెప్పింది. ఇటీవ‌ల ఆమె , మ‌రికొంద‌రు విద్యార్థులు విశ్వ విద్యాల‌యంలో ఒక ఫోర‌మ్ ను కూడా సృష్టించారు.

Also Read : Shah Rukh Khan

 

Leave A Reply

Your Email Id will not be published!