Ugadi Holiday : ఏపీలో ఉగాదికి సెల‌వు – జ‌గ‌న్

ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

తెలుగు వారి ఘ‌న‌మైన పండుగా భావించే ఉగాది (Ugadi) ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఏపీ (AP) ముఖ్య‌మంత్రి (CM) సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Jagan Mohan Reddy) తీపి క‌బురు చెప్పారు. ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఎప్ప‌టికీ ఉగాది (Ugadi) ఫెస్టివ‌ల్ ను పుర‌స్క‌రించుకుని ప్ర‌తి ప్ర‌భుత్వం సాధార‌ణంగా సెల‌వు ప్ర‌క‌టిస్తుంది. అయితే ప‌రిపాల‌న‌లో వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

ఇందులో భాగంగా కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేశారు. ఏదైనా శుభ‌కార్యం త‌ల‌పెట్టాలంటే ముందుగా పండుగ రోజు ప్రారంభించ‌డం ఆన‌వాయితీ. దీంతో మొద‌ట‌గా ప్ర‌భుత్వం ఆరోజు సెలవు లేదంటూ ప్ర‌క‌టించింది.

కొత్త జిల్లాల‌ను ప్రారంభిస్తుండ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విన్న‌పాలు వ‌చ్చాయి. పండ‌గ రోజు కూడా ప‌నులు చేయాలంటే క‌ష్ట‌మ‌ని, త‌మ‌కు సెల‌వు ఎప్ప‌టి లాగే ఇవ్వాల‌ని కోరారు.

దీంతో మాన‌వ‌తా దృక్ఫ‌థంతో సీఎం జ‌గ‌న్ రెడ్డి (Jagan Mohan Reddy) సెల‌వు ప్ర‌క‌టించాల‌ని ఆదేశించారు. ఈ మేర‌కు సాధార‌ణ ప‌రిపాల‌నాధికారి ముత్యాల‌రాజు జారీ చేశారు.

దీంతో ఏప్రిల్ 2న ప్రారంభించాల్సిన కొత్త జిల్లాల ప్రారంభాన్ని ఏపీ (AP) స‌ర్కార్ వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా ఈనెల 4న వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపింది.

ఇదిలా ఉండ‌గా ఆరోజు ఉదయం 9 గంట‌ల 5 నిమిషాల నుంచి 9.45 నిమిషాల మ‌ధ్య కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది.

త్వ‌ర‌లోనే ఇందుకు గాను నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, అధికారుల విభ‌జ‌న‌పై జ‌గ‌న్ సార‌థ్యంలో చ‌ర్చించారు.

Leave A Reply

Your Email Id will not be published!