APSRTC MD Shivaratri : మ‌ల్ల‌న్న భ‌క్తుల‌కు ఖుష్ క‌బ‌ర్

ముందుగానే ద‌ర్శ‌న టికెట్లు

APSRTC MD Shivaratri : అటు ఏపీ , ఇటు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. సంస్థ‌ల‌ను లాభాల బాట‌లోకి తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నంలో మునిగి పోయారు ఎండీలు ద్వారాకా తిరుమ‌ల రావు, స‌జ్జ‌నార్. ఇప్ప‌టికే కార్గో స‌ర్వీస్ ను ప్ర‌వేశ పెట్ట‌డంతో గ‌ణ‌నీయ‌మైన ఆదాయాన్ని మూట‌గ‌ట్టుకుంది ఆర్టీసీ. తాజాగా ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ద్వార‌కా తిరుమ‌ల‌రావు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఇప్ప‌టికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది ఆర్టీసీ(APSRTC MD Shivaratri). ఇందులో భాగంగా అద‌న‌పు బ‌స్సుల‌ను న‌డుపుతోంది.

శ్రీశైలంలో కొలువు తీరిన మ‌ల్లికార్జున స్వామిని ద‌ర్శించుకునేందుకు 9 ల‌క్ష‌ల మందికి పైగా భ‌క్తులు ద‌ర్శించు కుంటార‌ని అంచ‌నా. ఈ మేర‌కు భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బ‌స్సులు ఇప్ప‌టికే న‌డిపిస్తోంది. అయితే ఈసారి 1,075 స్ప‌ర్శ‌, శ్రీ‌ఘ్ర‌, అతి శ్రీ‌ఘ్ర ద‌ర్శ‌న టికెట్లును కూడా బ‌స్సుల్లోనే ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు ఎండీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు.

ఈ అవ‌కాశం ముందుగా బుక్ చేసుకున్న వారికి ఈ టికెట్ల‌ను ఇవ్వ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. రిజ‌ర్వేష‌న్ల టికెట్ల‌తో పాటు ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించే అపూర్వ‌మైన అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. భ‌క్తులు ఈ స‌ద‌వ‌కాశాన్ని వినియోగించు కోవాల‌ని ఎండీ కోరారు. అయితే ద‌ర్శ‌న టికెట్లు ఫిబ్ర‌వ‌రి 9న గురువారం నుంచి అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలిపారు.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే తిరుమ‌ల‌లో ఏపీఎస్ఆర్టీసీ ఇదే ప‌ద్ద‌తిన టికెట్లు ఇస్తోంది. రాత్రి వేళ‌ల్లో ఉచిత వ‌స‌తి కూడా క‌ల్పిస్తోంది. ఇదే ప‌ద్ద‌తిని శ్రీ‌శైలంలో కూడా అందుబాటులోకి తీసుకు రానున్నారు ఎండీ.

Also Read : 11న విశ్వ శాంతి గీతా పారాయ‌ణం

Leave A Reply

Your Email Id will not be published!