BV Doshi Died : భారత ఆర్కిటెక్ట్ బీవీ దోషి కన్నుమూత
ప్రధానమంత్రి మోదీ తీవ్ర సంతాపం
BV Doshi Died : భారత దేశం గర్వించ దగన వాస్తు శిల్పి బాలకృష్ణ దోషి(BV Doshi Died) కన్నుమూశారు. ఆయన మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. గొప్ప ముందు చూపు కలిగిన వాస్తు శిల్పిని దేశం కోల్పోయిందన్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో మృతి చెందారు. పద్మభూషణ్ గ్రహీత కూడా. లె కార్ బూసియర్ , లూయిస్ కాన్ వంటి దిగ్గజాలతో కలిసి పని చేశారు బాలకృష్ణ దోషి.
ఆయనకు 95 ఏళ్లు. మంగళవారం తన ఇంట్లో తుది శ్వాస పడిచారు. ఆధునిక భారత దేశం అగ్రశ్రేణి వాస్తు శిల్పిగా పేరొందారు బాలకృష్ణ దోషి. వివిధ వర్గాల నుండి పెద్ద ఎత్తున సంతాపం వ్యక్తమైంది. రాబోయే తరాలు ఆయన గొప్పతనాన్ని చూస్తారని పేర్కొన్నారు మోడీ.
1927లో పూణేలో పుట్టారు బాలకృష్ణ దోషి. లే కార్పుసియర్ వంటి వాస్తుశాస్త్ర దిగ్గజాలతో కలిసి పని చేశారు. ఆయన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ , అహ్మదాబాద్ తదితర గొప్ప సంస్థలను నిర్మించడంలో లూయీస్ ఖాన్ తో కలిసి పని చేశారు బాలకృష్ణ దోషి(BV Doshi Died). గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దోషిని నిర్మాణ ప్రపంచంలో ధ్రువ నక్షత్రం అని పేర్కొన్నారు.
భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. దోషి కంటే జీవితాన్ని ఎవరూ ఎక్కువగా ప్రేమించరని ఆయన కుటుంబీకులు తెలిపారు. అహ్మదాబాద్ లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండాలజీ, సీఈపీటీ యూనివర్శిటీ , కనోరియా సెంటర్ ఫర్ ఆర్ట్స్ , బెంగళూరు లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ , ఇండోర్ లోని టౌన్ షిప్ లలో భాగం పంచుకున్నారు బీవీ దోషి. ఎన్నో అవార్డులు దక్కాయి.
Also Read : ఇమేజ్ చెరిపేసేందుకు కోట్లు ఖర్చు – రాహుల్