Hardik Patel Arrest Warrant : హార్టిక్ ప‌టేల్ పై అరెస్ట్ వారెంట్

దేశ ద్రోహం కేసులో కోర్టు జారీ

Hardik Patel Arrest Warrant : గుజ‌రాత్ రాష్ట్రానికి చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే హార్దిక్ ప‌టేల్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది కోర్టు. 2017 లో ఆయ‌న‌పై దేశ ద్రోహం కింద కేసు న‌మోదైంది. ఇందుకు సంబంధించి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు. ఆనాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ఒక గ్రామంలో హార్దిక్ ప‌టేల్ ప్ర‌భుత్వ ఆదేశాల‌ను ఉల్లంఘిస్తూ రాజ‌కీయ ప్ర‌సంగం చేశాడు.

ఇదిలా ఉండ‌గా హార్దిక్ ప‌టేల్(Hardik Patel Arrest Warrant) గుజ‌రాత్ లో 2 దేశ ద్రోహ కేసుల‌తో స‌హా 12కు పైగా కేసుల‌ను ఎదుర్కొంటున్నాడు. రాష్ట్రంలోని సురేంద్ర న‌గ‌ర్ జిల్లాలో ఈ ఘ‌ట‌న ఆనాడు చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి కోర్టుకు హాజ‌రు కావాల‌ని ఇప్ప‌టికే నోటీసు జారీ చేసింది. అయినా వాటిని బేఖాత‌ర్ చేస్తూ హార్దిక్ ప‌టేల్ వ‌చ్చాడు. దీంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది గురువారం కోర్టు.

కోర్టు ఆదేశాల‌ను ధిక్క‌రించినందుకు అద‌న‌పు చీఫ్ జ్యుడీషియ‌ల్ మేజిస్ట్రేట్ డీడీ షా ప‌టేల్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఫిబ్ర‌వ‌రి 2 నాటి త‌న ఉత్త‌ర్వు ద్వారా ప‌టేల్ ను అరెస్ట్ చేసి త‌ప్ప‌కుండా కోర్టు ముందు హాజ‌రు ప‌ర్చాల‌ని పోలీస్ స్టేష‌న్ ఆఫీస‌ర్ ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఫిబ్ర‌వ‌రి 11న పోలీస్ స్టేష‌న్ కు ఈ ఉత్త‌ర్వు అందింద‌ని ధ్రువీక‌రించారు కూడా.

ప‌టేల్ తో పాటు మ‌రొక‌రు రూల్స్ పాటించ లేదంటూ ఎఫ్ఐఆర్ న‌మోదైంది. న‌వంబ‌ర్ 2017లో ధుతార్ ప‌ర్ గ్రామంలో జ‌రిగిన ర్యాలీలో రాజ‌కీయ ప్ర‌సంగం చేసినందుకు కోర్టు గ‌త వారం ఇదే కేసులో ప‌టేల్ ను నిర్దోషిగా ప్ర‌క‌టించింది. 2019లో కాంగ్రెస్ లో చేరాడు. 2022లో బీజేపీలోకి జంప్ అయ్యాడు.

Also Read : త్రిపుర‌లో గెలుపు ఖాయం – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!