Sharad Pawar : మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి మరాఠా మంత్రి నవాబ్ మాలిక్ ను ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ – ఈడీ అదుపులోకి తీసుకుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా 8 గంటల పాటు ఆయనను విచారించింది.
ఈ కేసుకు సంబంధించి నవాబ్ మాలిక్ ను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించి ఈడీ. ఈ సందర్భంగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది.
తమ పార్టీకి చెందిన ఎన్సీపీ లీడర్ , మంత్రిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ఆ పార్టీ చీఫ్ షరద్ పవార్(Sharad Pawar). ఎలాంటి సమాచారం లేకుండానే కావాలనే మంత్రిని అదుపులోకి తీసుకున్నారంటూ ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం వల్లనే మాలిక్ పై కక్ష గట్టారని, లేని పోని కేసులు పెడుతూ వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు శరద్ పవార్.
ఏదో ఒక రోజు కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగుతుందని తమకు అనుమానం ఉందన్నారు. అది ఇవాళ అరెస్ట్ తో రూఢీ అయ్యిందన్నారు. ఒక మంత్రిని ఇలా అదుపులోకి తీసుకోవడం అన్నద ప్రజాస్వామ్య యుతం కాదన్నారు.
మోదీని, అమిత్ షాతో పాటు బీజేపీ ప్రభుత్వంపై మండి పడుతూ వచ్చారు నవాబ్ మాలిక్ . దీంతో మోదీ త్రయం కావాలని కక్ష గట్టిందని ఫైర్ అయ్యారు శరద్ పవార్.
కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా ఎలాంటి ఆరోపణలు రాలేదని కానీ బీజేపీ సర్కార్ ను ప్రశ్నించి, నిలదీసినందుకే ఇలా చేశారంటూ వాపోయారు.
Also Read : యావత్ భారతమంతా మా కుటుంబం