Arun Goel: కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా !
కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా !
Arun Goel: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కమిషనర్ అరుణ్ గోయల్ తన రాజీనామా చేశారు. కమీషనర్ అరుణ్ గోయల్ రాజీనామాకు… భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. అరుణ్ గోయల్ పదవీకాలం 2027 డిసెంబరు వరకు ఉన్నప్పటికీ… ఆయన రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే రాజీనామాకు గల కారణాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. మార్చి 15వ తేదీన సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేస్తారని వార్తలు వస్తున్న తరుణంలో అరుణ్ గోయెల్ రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అరుణ్ గోయెల్ రాజీనామా ప్రభావం ఎన్నికల నిర్వహణపై ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Arun Goel Resign Viral
అరుణ్ గోయల్ పంజాబ్ కేడర్‌కు చెందిన 1985 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. 2022 నవంబర్ 18వ తేదీన ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఆ తర్వాతి రోజే ఆయన్ని ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. ఈ నియామకంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ అరుణ్ గోయల్(Arun Goel) నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఐదేళ్ళ పాటు అంటే 2027 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.
అరుణ్ గోయల్ తో పాటు అనూప్ చంద్రపాండే, రాజీవ్ కుమార్ మొత్తం ముగ్గురు కేంద్ర ఎన్నికల సంఘంలో కమీషనర్లుగా నియమితులయ్యారు. అయితే అనూప్ చంద్రపాండే పదవి కాలం ఫిబ్రవరిలో ముగియడంతో… ప్రస్తుతం అరుణ్ గోయల్, రాజీవ్ కుమార్ మాత్రమే ఉన్నారు. అనూప్ చంద్ర పాండే స్థానంలో మరోక అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం కమీషనర్ గా నియమించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తాజాగా అరుణ్ గోయల్ కూడా రాజీనామా చేయడంతో… ఇప్పుడు రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు.
Also Read : BJP MLA : కామారెడ్డి లో ప్రోటోకాల్ వివాదం..నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి