Arunlal Marriage : అరుణ్ లాల్ ఒకప్పుడు భారత క్రికెట్ జట్టు తరపున ఆడాడు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రంజీ జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్నాడు. ఆయనకు ఇప్పుడు 66 ఏళ్లు. కానీ మనోడికి ఈ వయసులో తోడు కావాల్సి వచ్చింది.
ఇంకేం మొదటి భార్య మంచాన పడి ఉంటే తను మాత్రం ప్రేమ పేరుతో పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ మాజీ క్రికెటర్ ఏకంగా పెళ్లి కార్డు కూడా కొట్టించాడు. మీరంతా రావాలని, తమను ఆశీర్వదించాలని కోరాడు.
ట్విట్టర్ వేదికగా ఇన్విటేషన్ కూడా షేర్ చేశాడు. దీంతో అరుణ్ లాల్ (Arunlal Marriage)ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాడు. ఇదేం పోయే కాలం లేటు వయసులో పెళ్లి ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు.
విచిత్రం ఏమిటంటే అరుణ్ లాల్ తన మొదటి భార్య ను ఒప్పించి మరీ పెళ్లికి సిద్దమయ్యాడు. ప్రస్తుతం తను ప్రేమించి పెళ్లి చేసుకోబోయే ఆమె పేరు బుల్ బుల్ సాహ. ఆమెకు 38 ఏళ్లు ఉన్నాయి.
వచ్చే నెల మే 2న కోల్ కతా ల ఓని పీర్లెస్ ఇన్ లో అరుణ్ లాల్(Arunlal Marriage) , సాహ పెళ్లి జరగనుంది. ఇందులో భాగంగా తనకు కావాల్సిన వారికి, మాజీ, తాజా క్రికెటర్లకు ఇన్విటేషన్ పంపించాడు.
కాగా మొదటి భార్య రీనాకు విడాకులు ఇచ్చాడు. అయినా ఆమె అనారోగ్యం కారణంగా అరుణ్ లాల్ వద్దే ఉంటోంది. మొత్తంగా ఈ మాజీ క్రికెటర్ చేసిన పనిని కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం నిప్పులు చెరుగుతున్నారు.
లేటు వయసులో నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా అంటూ మండి పడుతున్నారు. కలికాలం ఏదైనా జరగవచ్చు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read : ఐపీఎల్ లో ధావన్ అరుదైన ఘనత