MLC Kavitha Pillai : పిళ్లై..ఎమ్మెల్సీ కవిత విచారణ జరిగేనా
మార్చి 20న ఈడీ ముందుకు వెళ్లేనా
Pillai Kavitha ED : ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే 34 మందిపై సీబీఐ అభియోగాలు మోపింది. ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేసింది. సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించిందని ఈడీ స్పష్టం చేసింది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు(MLC Kavitha) కీలక పాత్ర ఉందంటూ సంచలన ఆరోపించింది. ప్రత్యేక కోర్టులో సమర్పించిన ఛార్జ్ షీట్ లో కీలక ఆరోపణలు చేసింది.
ఏకంగా రూ. 100 కోట్లు చేతులు మారాయని , ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఢిల్లీ మద్యం కుంభకోణంకు సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చెందిన ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు తో పాటు హైదరాబాద్ లిక్కర్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్రన్ పిళ్లైని(Pillai Kavitha ED) అదుపులోకి తీసుకుంది.
ఇప్పటికే సీబీఐ కవితను హైదరాబాద్ లో విచారించింది. అనంతరం మనీ లాండరింగ్ ఇందులో చోటు చేసుకుందని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ నోటీసు జారీ చేసింది. మార్చి 11న 9 గంటల పాటు కవితను విచారించింది. ఇదే సమయంలో మార్చి 16న హాజరు కావాలని మరోసారి నోటీసు ఇచ్చింది.
ఏక కాలంలో ఆడిటర్ బుచ్చిబాబు, వ్యాపారవేత్త రామచంద్రన్ పిళ్లైని విచారించనుంది. ఇప్పటికే మరోసారి కస్టడీని కోరింది ప్రత్యేక కోర్టులో ఈడీ. ఏడు రోజులు అడిగితే 5 రోజుల సమయం ఇచ్చింది. మార్చి 20న విచారణ కావాలంటూ ఈడీ నోటీసు ఇచ్చింది. అంతే కాకుండా సుప్రీంకోర్టులో కవితకు ఎలాంటి మినహాయింపు ఇవ్వకూడదని పిటిషన్ దాఖలు చేసింది.
Also Read : రానన్న కవిత కుదరదన్న ఈడీ