Arun Singh : త్వరలోనే కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మైని మార్చ బోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. మంగళవారం బసవేశ్వరుడి జయంతి సందర్భంగా కేంద్ర హొం శాఖ మంత్రి బెంగళూరుకు వచ్చారు. ఆయనకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
రాష్ట్రంలో అధికారాన్ని శాసించే ఏకైక సామాజిక వర్గం లింగాయత్. ప్రస్తుతం ఉన్న సీఎం బొమ్మైతో పాటు మాజీ సీఎం బీఎస్ యెడియూరప్ప కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వారే.
ఇదిలా ఉండగా సీఎం మార్పుపై కర్ణాటక రాష్ట్ర ఇన్ చార్జ్ , భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్(Arun Singh) స్పందించారు. ఇదంతా ఊహాజనితమేనంటూ కొట్టి పారేశారు.
ప్రస్తుతం పార్టీ ప్రశాంతంగా ఉందని, తమ ముందు రాబోయే ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలనే దానిపై తాము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కొంత మంది ఎమ్మెల్యేలు కర్ణాటక మంత్రివర్గంలో గుజరాత్ రాష్ట్రం తరహా మార్పును సమర్థిస్తున్నారు.
కేబినెట్ విస్తరణ లేదా పునర్ వ్యవస్థీకరణ అన్నది సీఎం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. తమ చేతుల్లో ఏమీ ఉండదన్నారు. హైకమాండ్ సూచనలు ఇస్తుందే తప్పా అంతర్గతంగా జోక్యం చేసుకోదన్నారు.
మిగతా పార్టీల తరహాలో తమ పార్టీ ఉండదన్నారు. అరుణ్ సింగ్ (Arun Singh) మీడియాతో మాట్లాడారు. ఆచరణకు నోచుకోని ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు అంటూ ఉండవన్నారు. వీటికి తానేమీ ఆన్సర్ ఇవ్వలేనన్నారు.
2023 లో అసెంబ్లీ ఎన్నికల దాకానైనా బొమ్మై సీఎంగా ఉంటారా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు అరుణ్ సింగ్ . సీఎం సామాన్యుడు. ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజల కోసం పని చేస్తున్నారంటూ కితాబు ఇచ్చారు.
Also Read : జోధ్ పూర్ ఘటన దురదృష్టకరం – సీఎం