Aruna Miller : మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ గా అరుణా మిల్ల‌ర్

తొలి భార‌తీయ అమెరిక‌న్

Aruna Miller : ప్ర‌వాస భార‌తీయులు ప్ర‌పంచంలో టాప్ పొజిష‌న్ల‌లో కొన‌సాగుతున్నారు. భార‌త మూలాలు ఉన్న రిషి సున‌క్ యుకెకు ప్ర‌ధాన మంత్రిగా ఎన్నిక‌య్యారు. తాజాగా మ‌రో ప్ర‌వాస భార‌తీయురాలు అరుదైన ఘ‌న‌త సాధించారు. అమెరికాలోని మేరీ ల్యాండ్ కు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మితులయ్యారు భార‌తీయ అమెరిక‌న్ అరుణా మిల్ల‌ర్(Aruna Miller).

లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ను అనుస‌రించే రాష్ట్ర అత్యున్న‌త అధికారి , గ‌వ‌ర్న‌ర్ రాష్ట్రం వెలుప‌ల ఉన్న స‌మ‌యంలో లేదా పాల‌న సాగించ‌లేని స‌మ‌యంలో ఎల్జీ పాత్ర‌ను స్వీక‌రిస్తారు.

ఇదిలా ఉండ‌గా అమెరికా అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ , వైఎస్ ప్రెసిడెంట్ క‌మ‌లా హారిస్ కు ఎన్నిక‌ల ప్ర‌చారంలో అరుణా మిల్ల‌ర్ పాల్గొన్నారు. వారి గెలుపు కోసం కీల‌క పాత్ర పోషించారు. మ‌రో వైపు ఈ మేరీ ల్యాండ్ అత్యంత ప్రాధాన్య‌త క‌లిగిన ప్రాంతంగా పేరొందింది.

అమెరికా రాజ‌ధానికి ప‌క్క‌నే ఉంది. మేరీల్ఆయండ్ రాష్ట్రంలో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ రేసులో గెలిచిన తొలి భార‌తీయ అమెరిక‌న్ గా గుర్తింపు పొందారు అరుణా మిల్ల‌ర్(Aruna Miller). ఆమె రాజ‌కీయ నాయ‌కురాలిగా చ‌రిత్ర సృష్టించారు. మేరీ ల్యాండ్ హౌస్ కు మాజీ ప్ర‌తినిధిగా ఉన్నారు. డెమోక్ర‌టిక్ గ‌వ‌ర్న‌ర్ గా ఎన్నికైన వ‌స్ మూర్ తో పాటు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ టికెట్ పై అరుణా మిల్ల‌ర్.

ఇదిలా ఉండ‌గా గ‌వ‌ర్న‌ర్ మ‌ర‌ణించినా, లేక రాజీనామా చేసినా లేదా ప‌ద‌వి నుండి తొల‌గించ‌బ‌డినా లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కూడా గ‌వ‌ర్న‌ర్ అవుతారు. మంగ‌ళ‌వారం సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంట‌నే మూర్ , మిల్ల‌ర్ త‌మ రిపబ్లిక‌న్ ఛాలెంజ‌ర్ల‌పై ఎన్నికైన‌ట్లు ప్ర‌క‌టించారు. కాగా ప్రెసిడెంట్ బైడెన్ , వైస్ ప్రెసిడెంట్ క‌మ‌లా మూర్, మిల్ల‌ర్ల‌కు అనుకూలంగా ప్ర‌చారం చేశారు.

Also Read : ఫోర్బ్స్ టాప్ 20 మ‌హిళ‌ల్లో మ‌నోళ్లు

Leave A Reply

Your Email Id will not be published!