Arvind Kejriwal : స‌త్తా చాటిన విద్యార్థుల‌కు సీఎం కంగ్రాట్స్

జేఈఈ మెయిన్స్ లో అత్య‌ధిక స్కోర్లు

Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న విద్యా న‌మూనా ఆస‌క్తిక‌రమైన ఫ‌లితాలు ఇస్తోంది. గ‌తంలో కంటే ఈసారి ఉత్తీర్ణ‌త శాతం మ‌రింత పెర‌గ‌డం విశేషం. సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ విద్యా రంగానికి అధిక ప్రాధాన్య‌త ఇచ్చారు. గ‌తంలో డిప్యూటీ సీఎం గా ఉన్న మ‌నీష్ సిసోడియా విద్యా ప‌రంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇవాళ అక్క‌డ పాఠ‌శాల‌లు ఆధునిక కంపెనీల‌ను త‌ల‌పింప చేస్తున్నాయి. ఎవ‌రైనా స‌రే ఇక్క‌డ చ‌దువు కునేందుకు వీలుగా తీర్చి దిద్దారు. మౌలిక స‌దుపాయాలు క‌ల్పిస్తే విద్యార్థులు రాణిస్తార‌ని రుజువు చేశారని సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind kejriwal) పేర్కొన్నారు.

ప్ర‌త్యేకించి ఢిల్లీ లోని ప్ర‌భుత్వ బ‌డుల్లో చేరిన విద్యార్థులు జేఈఈ మెయిస్స్ , అడ్వాన్స్ డ్ ప‌రీక్ష‌లలో అసాధార‌ణ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర్చార‌ని, వారికి ఈ సంద‌ర్భంగా అభినంద‌న‌లు తెలియ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు సీఎం. గ‌తంలో కంటే ఈసారి రెండు రెట్లు ఉత్తీర్ణత శాతం పెర‌గ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు.

ఢిల్లీ స‌ర్కార్ ఆద‌ర్శ‌వంత‌మైన విద్యా న‌మూనా ఇప్పుడు ప్ర‌భుత్వ బ‌డుల్లో చ‌దివే పిల్ల‌ల ఆకాంక్షల‌ను పెంపొందించేందుకు దోహ‌ద ప‌డింద‌ని స్ప‌ష్టం చేశారు అర‌వింద్ కేజ్రీవాల్. ఈ అద్భుత‌మైన మైలు రాయిని సాధించినందుకు ఢిల్లీలోని విద్యార్థుల‌కు , పేరెంట్స్ కు, వారిని తీర్చి దిద్ది ఫ‌లితాలు సాధించేలా చేసిన టీచ‌ర్ల‌కు అభినంద‌న‌లు తెలిపారు సీఎం.

Also Read : Revanth Reddy : ఖాకీల‌తో స‌ర్కార్ న‌డుపుతున్న కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!