Manish Sisodia : అరవింద్ కేజ్రీవాల్ నా గురువు – సిసోడియా
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ షాకింగ్ కామెంట్స్
Manish Sisodia : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం, ఆప్ ఫౌండర్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) తన గురువు అని పేర్కొన్నారు.
గుజరాత్ లో కేజ్రీవాల్ తో పాటు సిసోడియా కూడా పర్యటిస్తున్నారు. తమ పార్టీ గనుక పవర్ లోకి వస్తే రాష్ట్రంలో ఉచిత విద్య, వైద్యం అందజేస్తామన్నారు.
అహ్మదాబాద్ లోని హిమ్మత్ నగర్ లో ప్రసంగించారు. రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇదిలా ఉండగా నెల రోజుల వ్యవధిలో రాష్ట్రానికి రావడం ఇది ఐదోసారి.
మద్యం పాలసీకి సంబంధించిన ఆరోపణలపై సీబీఐ(CBI) అభియోగాలు మోపడం కక్ష సాధింపు లో భాగమేనని కొట్టి పారేశారు. తాను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వైదొలిగితే తనపై నమోదు చేసిన అన్ని కేసులను మాఫీ చేస్తామంటూ బంపర్ ఆఫర్ బీజేపీ ఇచ్చిందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
కానీ తన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు తాను తల వంచే ప్రసక్తి లేదన్నారు. రోజు రోజుకు అరవింద్ కేజ్రీవాల్ కు పెరుగుతున్న జనాదరణను చూసి ఓర్వలేక పోతున్నారంటూ మోదీపై, బీజేపీపై మండిపడ్డారు.
మీరు ఆప్ ను వీడండి. బీజేపీ మీకు మంచి ఆఫర్ ఇస్తుంది. ఇక కేసులంటూ ఏమీ ఉండవు. మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తామంటూ ఆఫర్లు వచ్చాయని కానీ తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తాను తలవంచే ప్రసక్తి లేదన్నారు మనీష్ సిసోడియా(Manish Sisodia).
కేజ్రీవాల్ తనకు రాజకీయ గురువుగా పేర్కొన్నారు డిప్యూటీ సీఎం. ఆయనను వదిలి వెళ్లే ప్రసక్తి లేదన్నారు.
Also Read : సెప్టెంబర్ 5 వరకు సంజయ్ రౌత్ కస్టడీ