Arvind Kejriwal : జైన్ భక్తుడు తప్పు చేయడు – కేజ్రీవాల్
మండిపడ్డ మంత్రి స్మృతీ ఇరానీ
Arvind Kejriwal : మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ ఆప్ సర్కార్ కు చెందిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుంది. కోర్టులో హాజరు పర్చడంతో ఆయనకు కోలుకోలేని షాక్ తగిలింది.
ఈనెల 9 వరకు పోలీస్ కస్టడీ విధించింది. దీనిపై స్పందించారు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). సత్యేంద్ర జైన్ పై లేని పోని ఆరోపణలు చేస్తూ వచ్చారని, ఇప్పటి వరకు కేసు నమోదు చేసిన సీబీఐ ఎలాంటి ఆధారాలు చూపించ లేక పోయిందని ధ్వజమెత్తారు.
ఆయన నిజమైన దేశ భక్తుడుని కొనియాడారు. ఢిల్లీకి మొహల్లా క్లినిక్ లను పరిచయం చేసిన ఘనత సత్యేంద్ర జైన్ కు దక్కుతుందన్నారు అరవింద్ కేజ్రీవాల్.
ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర సర్కార్ పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించాలని పేర్కొన్నారు. ఇక అదుపులోకి తీసుకున్న ఈడీ కూడా చేతులెత్తేయడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఎందుకంటే ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడని ఆయనను వదిలి వేయక తప్పదన్నారు. ఇదిలా ఉండగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కు వంత పాడటంపై తీవ్రంగా తప్పు పట్టారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ.
ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విచారణ జరుగుతోంది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఇప్పటికే కోర్టు ఈడీకి కస్టడీకి ఇచ్చింది. ఇంత లోనే కోర్టు జడ్జి లా మారి పోయి క్లీన్ చిట్ ఎలా ఇస్తారంటూ సీఎం కేజ్రీవాల్ ను కడిగి పారేసింది.
Also Read : అయోధ్యలో గర్భగుడి పనులకు శ్రీకారం