Arvind Kejriwal : విద్య కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన
Arvind Kejriwal : విద్యా రంగంతో పాటు ఆరోగ్య రంగానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). బుధవారం ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పిల్లల చదువు కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నామని చెప్పారు సీఎం. ఎన్ని కోట్లు వెచ్చించేందుకైనా తాము సిద్దంగా ఉన్నామని, వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్.
Arvind Kejriwal Talking About Education
నేను కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నా. దాని విలువ ఏమిటో నాకు బాగా తెలుసు. ప్రపంచంలో దేనినైనా దొంగిలించ వచ్చు. సంపాదించు కోవచ్చు. కానీ విద్య ఒక్కటే చోరీకి గురి కాదని తెలుసు కోవాలని అన్నారు ఢిల్లీ సీఎం.
ఇవాళ దేశంలో ఎక్కడా లేని రీతిలో ఢిల్లీలో ప్రభుత్వ బడులు ఉన్నాయని , ఇది దేశానికి ఓ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఇవాళ కార్పొరేట్ పాఠశాలలు, విద్యా సంస్థలకు ధీటుగా వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సీఎం.
అంతే కాదు దేశంలోని ప్రతిష్టాత్మకమైన సంస్థలలో ఇక్కడ చదివిన పిల్లలు సీట్లు పొందుతున్నారని చెప్పారు. నీట్, జేఈఈ ఉత్తీర్ణత సాధించారని ఇదే నిదర్శనమన్నారు.
Also Read : Nara Lokesh Jagan : విశాఖలో రెండున్నర లక్షలు ఎక్కడ