Arvind Kejriwal : పిల్లలు చెడి పోవాలంటే బీజేపీలో చేర్చండి
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కామెంట్స్
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ చేశారు. తమ పార్టీతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.
ఇదే సమయంలో మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఆప్ కు ఓటు వేసి ఛాన్స్ ఇవ్వాలని కోరారు. లేదంటే మీ పిల్లలు గూండాలు, అల్లర్లు చేసే రౌడీలు, రేపిస్టులుగా మారాలని అనుకుంటే భారతీయ జనతా పార్టీలో చేర్చాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆదివారం హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రంలో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల నగారా మోగించారు.
ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ఆప్ ఫస్ట్ ప్రయారిటీ ఒక్కటే. బడులు బాగు చేయడం, పేదలతో పాటు అందరికీ ఉచితంగా ఆరోగ్యం అందించడం, క్రీడలను ప్రోత్సహించడం అని పేర్కొన్నారు.
మరి మీరు బడులు కావాలని అనుకుంటున్నారా లేక నిరంతరం మతం, కులం పేరుతో అల్లర్లు జరగాలని కోరుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు అరవింద్ కేజ్రీవాల్. తాము ఢిల్లీలో కొలువు తీరాక పాఠశాలల స్థితి గతులను పూర్తిగా మార్చేశామని చెప్పారు.
ఇవాళ ఢిల్లీ మోడల్ విద్యా విధానం దేశానికి ఆదర్శంగా మారిందన్నారు. ఈ విషయాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశంసించారని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా చదువుతున్నారని తెలిపారు. ఈ ఒక్క ఏడాది ఏకంగా 4 లక్షల మంది స్టూడెంట్స్ ప్రైవేట్ బడులను వదిలేసి సర్కారు పాఠశాలలో చేరారని చెప్పారు.
Also Read : ఈ దేశం ప్రజలది మోదీ..అమిత్ షాది కాదు