Arvind Kejriwal : విద్యుత్ వినియోగంపై కేజ్రీవాల్ ప్ర‌క‌ట‌న

స‌బ్సిడీ కోరుకునే వారికి మాత్ర‌మే విద్యుత్

Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. విద్యుత్ సంక్షోభంతో దేశంలోని ప‌లు రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

దాంతో దేశ రాజ‌ధాని ఢిల్లీ సైతం విద్యుత్ కొర‌త‌తో నీటి కొర‌త తీవ్రంగా ఎదుర్కొంటోంది. ఓ వైపు కేంద్రం ఇంకో వైపు రాష్ట్రం మ‌ధ్య ఆధిప‌త్య పోరు కూడా ఢిల్లీ వాసుల పాలిట శాపంగా మారింది.

ఈ త‌రుణంలో సీఎం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అక్టోబ‌ర్ 1 నుంచి విద్యుత్ స‌బ్సిడీ కోరుకునే వారకి మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని తెలిపారు. ఢిల్లీలో చౌక విద్యుత్ ఇవ్వ‌డం ఇబ్బందిగా మారింది.

ముంద‌స్తు అనుమ‌తి తీసుకున్న వారికి మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal ). ఉచిత‌, స‌బ్సిడీ విద్యుత్ అన్న‌ది ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించిన ప‌థ‌కం. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్న ప్ర‌స్తుత స‌మ‌యంలో ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

అడిగే వారికి మాత్ర‌మే ఉచితంగా లేదా స‌బ్సిడీ విద్యుత్ ఇస్తామ‌ని లేక పోతే య‌ధావిధిగా ఛార్జీలు వ‌సూలు చేయ‌నున్న‌ట్లు సీఎం వెల్ల‌డించారు. కొత్త రూల్స్ అక్టోబ‌ర్ నెల నుంచే అమ‌లులోకి వ‌స్తుంద‌న్నారు.

గురువారం అర‌వింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. విద్యుత్ వాడ‌కానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు సీఎం. ఎవ‌రైనా త‌మ‌కు తాము స‌మ‌ర్థుల‌మ‌ని భావిస్తే సాధార‌ణ రేటుకే విద్యుత్ వాడు కోవాల్సి ఉంటుంద‌న్నారు.

ప్ర‌స్తుతం ఢిల్లీలోని వినియోగ‌దారుల‌కు 200 యూనిట్ల దాకా జీరో విద్యుత్ బిల్లు వ‌స్తుంది. నెల‌కు 201 నుంచి 400 యూనిట్ల విద్యుత్ పై రూ. 800 స‌బ్సిడీ ఇస్తోంది స‌ర్కార్.

Also Read : రాజ‌కీయం చేయ‌డంలో బీజేపీ టాప్

Leave A Reply

Your Email Id will not be published!