Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీపై టార్గెట్ చేశారు. కావాలని ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేయడంపై తప్పు పట్టారు.
ఆయన బీజేపీకి, మోదీకి బహిరంగ సవాల్ విసిరారు. బుధవారం మీడియాతో మాట్లాడారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal ). ఒక వేళ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గనుక బీజేపీ విజయం సాధిస్తే తాము శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటామని సంచలన ప్రకటన చేశారు.
దమ్ముంటే వాయిదా వేయకుండా నిర్వహించాలని సవాల్ విసిరారు కేజ్రీవాల్(Arvind Kejriwal ). ఢిల్లీలో తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని బీజేపీ తట్టుకోలేక పోతోందని మండిపడ్డారు.
మరోసారి ఎంసీడీ ఎన్నికలను వాయిదా వేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది ప్రజాస్వామ్య స్పూర్తిగా విరుద్దమని పేర్కొన్నారు. ఈ ఎన్నికలను బీజేపీ సకాలంలో నిర్వహించి గెలిస్తే గనుక తాము పాలిటిక్స్ నుంచి తప్పుకుంటామన్నారు.
ఇదిలా ఉండగా ఢిల్లీలో ఉత్తర, తూర్పు, దక్షిణాది పౌర సంఘాలను ఏకం చేసే బిల్లుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీనిపై ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.
ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమని సీరియస్ అయ్యారు. బీజేపీ తనకు తాను ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయా పార్టీ అని ప్రచారం చేసుకుంటోంది.
కానీ చిన్న పాటి ఎన్నికలను చూసి జడుసు కుంటోందంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికలను వాయిదా వేయడం అంటే అమర వీరులను అవమానించడమేనని మండిపడ్డారు.
Also Read : సీఎంగా కొలువు తీరిన పుష్కర్ ధామి