Arvind Kejriwal : బీజేపీ నీచ రాజకీయాలకు చెంప దెబ్బ
ఈ విజయం ప్రజలకే అంకితం
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సంచలన కామెంట్స్ చేశారు. ఆదివారం ఢిల్లీలోని రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆప్ అభ్యర్థి దుర్గేష్ పాఠక్ 11,000 వేల ఓట్ల తేడాతో భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థి రాజేష్ భాటియాపై ఘన విజయం సాధించారు.
ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నీచ రాజకీయాలకు ఈ గెలుపు ఓ చెంప పెట్టు లాంటిదన్నారు. ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారని పేర్కొన్నారు.
ఆప్ అభ్యర్థిని గెలిపించినందుకు సీఎం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వ పనితీరుకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. బీజేపీ ప్రతిసారి ఏదో ఒక నెపంతో ప్రజలను మోసం చేయాలని చూసింది.
కానీ వారి ఆటలు ఢిల్లీలో సాగడం లేదన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఇదిలా ఉండగా మొత్తం 16 రౌండ్ల కౌంటింగ్ పూర్తయిందని, ఆప్ అభ్యర్థి దుర్గేష్ పాఠక్ విజయం సాధించినట్లు ఢిల్లీ చీఫ్ ఎన్నికల అధికారి రణ బీర్ సింగ్ ప్రకటించారు.
మరోసారి ఢిల్లీ ప్రజలు ఆప్ కు అండగా నిలిచారు. వారికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు సీఎం. ఢిల్లీ ప్రజలు గత కొన్నేళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీని తమ పార్టీగా స్వంతం చేసుకున్నారని కితాబు ఇచ్చారు.
ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ఎన్ని ప్రలోభాలు చూపించినా వాళ్లు ఎక్కడా తగ్గ లేదన్నారు. ఇది బీజేపీ నీచ, నికృష్ణ , దగాకోరు రాజకీయాలకు చెంప పెట్టు లాంటిది ఈ గెలుపు అని పేర్కొన్నారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) .
మరింత కష్టపడి పని చేసేందుకు, సేవ చేసేందుకు అవకాశం ఇచ్చారని చెప్పారు.
Also Read : ‘రాడిసన్ బ్లూ’ కాదది బిగ్ బాస్ హౌస్ – రౌత్
राजेंद्र नगर के लोगों का दिल से आभार
दिल्ली के लोगों के इस अथाह स्नेह और प्रेम का मैं आभारी हूँ। यही हमें और मेहनत एवं सेवा करने की प्रेरणा देता है
लोगों ने उनकी गंदी राजनीति को हराया और हमारे अच्छे काम को सराहा
शुक्रिया राजेंद्र नगर, शुक्रिया दिल्ली #AAPsweepsRajinderNagar
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 26, 2022