Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ చేశారు. మరోసారి కేంద్ర సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ లో భగవంత్ మాన్ సారథ్యంలోని ఆప్ సర్కార్ ఇంటింటికీ రేషన్ డెలివరీ పథకాన్ని ప్రారంభించారు.
దీనిపై ప్రత్యేకంగా స్పందించారు కేజ్రీవాల్(Arvind Kejriwal ). దేశ రాజధాని ఢిల్లీలో ఈ పథకానికి కేంద్రం కావాలని అడ్డు తగులుతోందంటూ ఆరోపించారు. ఈ పథకం వల్ల పేదలకు న్యాయం జరుగుతోందని తాము ప్రయత్నం చేశామని కానీ మోదీ పట్టించు కోలేదన్నారు.
ప్రస్తుతం ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటింటికీ రేషణ్ పంపిణీ పథకాన్నిపంజాబ్ లో అమలు కావడం ఆనందంగా ఉందన్నారు. దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గత నాలుగు సంవత్సరాలుగా ఢిల్లీలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ పథకాన్ని తీసుకు వచ్చామని కానీ కేంద్రం కావాలని అడ్డు పడుతోందంటూ మండిపడ్డారు. మిగిలిన రాష్ట్రాలు ఈ పథకాన్ని అనుసరిస్తున్నాయని కానీ కేంద్రం తీరు దారుణంగా ఉందంటూ సీరియస్ అయ్యారు కేజ్రీవాల్.
మొహల్లా క్లినిక్ ల తరహాలో ఈ పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. దీని వల్ల కోట్లాది మంది పేదల ఆకలి తీరుతుందన్నారు.
దీని వల్ల రేషన్ కోసం పేదలు క్యూలో నిల్చోవాల్సిన అవసరం ఉండదన్నారు సీఎం. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారంటూ మండిపడ్డారు.
Also Read : ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే – బీజేపీ