Arvind Kejriwal : మోదీ నిర్వాకం రైల్వే వ్యవస్థ నాశనం
కార్పొరేట్లకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు
Arvind Kejriwal : ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. రైల్వే వ్యవస్థను సర్వ నాశనం చేశారని ఆరోపించారు. నిరక్షరాస్యులతో కూడిన ప్రభుత్వం ఉండడం వల్లనే పాలన పక్కదారి పట్టిందని మండిపడ్డారు.
రైల్వే శాఖ మంత్రి నిర్వాకం కారణంగా రైళ్లు ప్రమాదాలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఉన్న వ్యవస్థలను అన్నింటినీ సర్వ నాశనం చేశారంటూ ధ్వజమెత్తారు సీఎం. కార్పొరేట్ కంపెనీలకు, బడా వ్యాపారవేత్తలకు, తమ వారికి అప్పనంగా ధారాదత్తం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నిత్యం వేలాది మంది ప్రయాణీకులను ఇతర దేశాలకు చేరవేసే విమానయాన రంగాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
అక్కడ కూడా ఎయిర్ పోర్టుల నిర్వహణను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఇక ఇవాళ రైల్వేలలో ప్రయాణం చేయాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). బాగా నడుస్తున్న రైళ్లను పక్కదారి పట్టించారని, కావాలని నష్టాల్లోకి వెళ్లేలా చేశారని ఫైర్ అయ్యారు.
ఏసీ కోచ్ రిజర్వేషన్ తీసుకున్నా కూర్చోవడానికి, పడుకోవడానికి సీటు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. ఏసీ, స్లీపర్ కోచ్ లు సాధారణ బోగీల కంటే అధ్వాన్నంగా ఉన్నాయని నిప్పులు చెరిగారు అరవింద్ కేజ్రీవాల్.
Also Read : Chandrababu Naidu : నా లక్ష్యం పేదరికం లేని సమాజం