Arvind Kejriwal : ఎంత మంది పండిట్ల‌ను త‌ర‌లించారు

బీజేపీ రాజ‌కీయం కేజ్రీవాల్ ఆగ్రహం

Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ క‌న్వీన‌ర్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) మ‌రోసారి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ప్ర‌ధాని మోదీని ఆయ‌న టార్గెట్ చేశారు. ది క‌శ్మీర్ ఫైల్స్ మూవీకి వినోద ప‌న్ను ఇవ్వాల‌ని ఢిల్లీకి చెందిన బీజేపీ నేత‌లు కోర‌డాన్ని ఆయ‌న మ‌రోసారి త‌ప్పు ప‌ట్టారు.

కేవ‌లం రాజ‌కీయం చేసేందుకే ఈ మూవీని ముందుకు తీసుకు వ‌చ్చార‌ని ఆరోపించారు. దేశంలో లెక్క‌లేన‌న్ని స‌మ‌స్య‌లు కొలువు తీరి ఉన్నాయ‌ని కానీ దీనిని ప్ర‌ధాన‌మంత్రి భుజానికి ఎత్తు కోవ‌డం మ‌రీ విచిత్రంగా ఉంద‌న్నారు కేజ్రీవాల్(Arvind Kejriwal).

అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేస్తూ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారంటూ సీఎం ఆరోపించారు. ముస్లింల కార‌ణంగా పండిట్లు వ‌ల‌స పోయారని చెబుతున్నార‌ని మ‌రి ఎనిమిదేళ్ల పాటు దేశాన్ని ఏళుతున్న మోదీ ఎంత మందిని తిరిగి ర‌ప్పించ గ‌లిగారో చెప్పాల‌న్నారు.

ప‌క్కా సినిమా పేరుతో వ్యాపారం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. దాని ద్వారా వ‌చ్చిన ఆదాయాన్ని కాశ్మీరీ పండిట్ల సంక్షేమానికి ఖ‌ర్చు చేయాల‌ని సూచించారు.

ఇన్నేళ్ల కాలంలో ఒక్క కాశ్మీరీ పండిట్ కుటుంబాన్ని బీజేపీ లోయ‌కు త‌ర‌లించిందా అని సూటిగా ప్ర‌శ్నించారు అర‌వింద్ కేజ్రీవాల్. యూట్యూబ్ ద్వారా వ‌చ్చిన ఆదాయాన్ని కాశ్మీరీ పండిట్ల సంక్షేమానికి ఖ‌ర్చు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

దేశం మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దంటూ మోదీపై నిప్పులు చెరిగారు ఆప్ చీఫ్‌. ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ ఊహించ‌ని రీతిలో వ‌సూళ్లు సాధించింది. ఇప్ప‌టికే రూ. 200 కోట్లు సాధించింది.

Also Read : యూపీలో ఉచిత రేష‌న్ కంటిన్యూ

Leave A Reply

Your Email Id will not be published!