Arvind Kejriwal : వివేక్ అగ్ని హోత్రి తీసిన ది కశ్మీర్ ఫైల్స్ ఊహించని రీతిలో దూసుకు పోతోంది వసూళ్ల పరంగా. ఇప్పటి వరకు రూ. 200 కోట్లు దాటేసింది. ఈ మూవీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
బీజేపీ కావాలని దానిని భుజానికి ఎత్తుకుందని, దీనికి వెనుక రాజకీయం తప్ప మరొకటి లేదని నిప్పులు చెరిగారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇప్పటికే బీజేపీ నేతృత్వంలోని పలు రాష్ట్రాలు ఈ చిత్రానికి వినోద పన్ను మినహాయింపు ఇచ్చాయి.
దీనిని తీవ్రంగా తప్పు పట్టారు కేజ్రీవాల్(Arvind Kejriwal ). ఒక వేళ దేశ ప్రజలందరు చూడాలని అనుకుంటే ది కశ్మీర్ ఫైల్స్ ను యూట్యూబ్ లో పెట్టాలని , అంతా ఉచితంగా చూస్తారని సూచించారు.
ఇది కేవలం ఓ డ్రామా అని మండిపడ్డారు. సామాన్యులు, ప్రజలు , తామంతా ఫ్రీగా యూట్యూబ్ లో చూస్తామని పేర్కొన్నారు. కేంద్రంలో ఎనిమిది ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రధాని రాజకీయ లబ్ధి కోసం ఈ సినిమాను వాడుకుంటున్నారని ఆరోపించారు.
దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే ఆయన మాత్రం సినిమా ప్రమోషన్ లో బిజీగా మారారని మండిపడ్డారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal ). సినిమాపై పన్ను ఎత్తి వేయాలని, ధరలు తగ్గితే తామంతా చూస్తామంటూ ఢిల్లీ బీజేపీ నాయకులు చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఈ మేరకు అసెంబ్లీలో దీనిపై ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ పండిట్ల పేరుతో కొందరు కోట్లు వెనకేసుకొంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. మీరేమో పోస్టర్లు అతికిస్తూ ప్రచారం చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
Also Read : అజిత్ దోవల్ కు చైనా ఆహ్వానం