Aryan Suhana Khan : ఐపీఎల్ వేలంలో ఆర్య‌న్..సుహానా ఖాన్

భారీ ధ‌ర‌కు శ్రేయ‌స్ అయ్య‌ర్ కొనుగోలు

Aryan Suhana Khan : బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో ఐపీఎల్ 2022 వేలం పాట ఇంకా కొన‌సాగుతూనే ఉంది బెంగ‌ళూరు వేదిక‌గా. గ‌త ఐపీఎల్ వేలంలో 8 జ‌ట్ల‌కు సంబంధించి ఫ్రాంచైజీలు పాల్గొంటే ఈసారి రెండు జ‌ట్లు అద‌నంగా చేరాయి.

దీంతో మొత్తం 10 ఫ్రాంచైజీలు ఈ ఆక్ష‌న్ లో పాల్గొన్నాయి. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ఫ్రాంచైజీ విష‌యంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. గ‌త ఏడాది జ‌రిగిన వేలం పాట‌లో ఆ ఫ్రాంచైజీకి చెందిన బాలీవుడ్ న‌టుడు షారుఖ్ ఖాన్ హాజ‌రు అయ్యాడు.

కానీ ఊహించ‌ని రీతిలో మిస్స‌య్యాడు. కొత్త ఏడాది జ‌రుగుతున్న వేలం పాట‌లో ఆయ‌న త‌న‌యుడు, ఇటీవ‌ల డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్య‌న్ ఖాన్ తో పాటు సుహానా ఖాన్ (Aryan Suhana Khan)హాజ‌రయ్యారు.

ఇప్పుడు వీరిద్ద‌రి గురించే ఎక్కువ‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. వీరిద్ద‌రూ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచారు. ఇక కేకేఆర్ ను జూహ్లీ చావ్లా, షారుఖ్ ఖాన్ ఓన‌ర్లుగా ఉన్నారు. గౌతం గంభీర్ సార‌థ్యంలో రెండు సార్లు ఆ జ‌ట్టు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది.

ఇక సుహానా ఖాన్ , ఆర్య‌న్ ఖాన్ బెయిల్ త‌ర్వాత క‌లిసి బ‌హిరంగంగా క‌నిపించ‌డం ఇదే మొద‌టి సారి కావ‌డం విశేషం. ఐపీఎల్ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు హ‌ల్ చ‌ల్ గా మారాయి.

సుహానా ఖాన్ ఐపీఎల్ వేలంలోకి రావ‌డం ఇదే తొలిసారి కాగా ఆర్య‌న్ ఖాన్(Aryan Suhana Khan) గ‌తంలో జరిగిన వేలంలో షారుఖ్ ఖాన్ తో క‌లిసి పాల్గొన్నాడు. గ‌త ఏడాది వేలం పాట‌లో జూహ్లీ చావ్లా కూతురు జాహ్న‌వి మెహ‌తా పాల్గొన‌డం అప్ప‌ట్లో హ‌ల్ చ‌ల్ అయ్యింది.

Also Read : ఐపీఎల్ వేలం నిర్వాహ‌కుడిగా చారు శ‌ర్మ

Leave A Reply

Your Email Id will not be published!