Asaduddin Owaisi : కొలువులు కష్టం పెళ్లి చేసుకోవడం ఉత్తమం
సంచలన కామెంట్స్ చేసిన ఎంఐఎం చీఫ్
Asaduddin Owaisi : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అప్పుడప్పుడు సెటైర్లు కూడా వేస్తుంటారు. ఆయనను కొందరు బీజేపీకి బి టీం అని కూడా ఆరోపణలు చేస్తారు. వాటిని ఆయన తిప్పి కొడతారు. తాజాగా గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
డిసెంబర్ 1, 5న రెండు విడతలుగా ఎన్నికలకు ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. దీంతో గుజరాత్ లో నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం జరుగుతోంది. గత 27 ఏళ్లుగా వరుసగా గెలుస్తూ వస్తోంది భారతీయ జనతా పార్టీ. ప్రధానంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi)కి, ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాకు ఈసారి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.
ఇక బీజేపీతో పాటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం కూడా తమ సత్తా ఏమిటో చూపించాలని తహ తహ లాడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ప్రధానంగా ప్రధానమంత్రిని టార్గెట్ చేశారు. ఈ తొమ్మిది సంవత్సరాల బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో దేశంలో ఒరిగింది ఏమీ లేదన్నారు.
ప్రతి ఏడాదికి 2 కోట్ల కొలువులు ఇస్తానని నరేంద్ర మోదీ చెప్పారని ఇప్పటి వరకు కనీసం 10 వేల జాబ్స్ కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. తాను చెప్పడం లేదని ఈ విషయాన్ని గణాంకాలతో సహా భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ చెప్పారన్నారు.
ఇదే సమయంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి నిరుద్యోగులకు ఇక మోదీ ఉద్యోగాలు ఇవ్వరని పోయిన వయస్సు తిరిగి రాదని , వెంటనే పెళ్లిళ్లు చేసుకోవాలని సూచించారు ఓవైసీ. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : భైంస్లా కామెంట్స్ సచిన్ పైలట్ సీరియస్