Asaduddin Owaisi : హైదరాబాద్ – ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. తెలంగాణలో నవంబర్ 3న ప్రభుత్వ గెజిట్ డిక్లేర్ చేయనుంది. 13 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. నవంబర్ 15న డెడ్ లైన్ విధించింది. నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడిస్తుంది.
Asaduddin Owaisi Shocking Comments
ఈ సందర్బంగా ఎన్నికల షెడ్యూల్ పై స్పందించారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi). మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో తిరిగి మూడోసారి బీఆర్ఎస్ పవర్ లోకి వస్తుందని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు ఓవైసీ.
ఎంఐఎం బేషరతుగా బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కూడా తమ కోసం సపోర్ట్ గా ఉంటుందని పేర్కొన్నారు. ఇవాళ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు అసదుద్దీన్ ఓవైసీ.
రాష్ట్రంలో కొన్నేళ్లుగా పాలించిన కాంగ్రెస్ పార్టీకి, దేశంలో కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీకి గెలిచే ఛాన్స్ లేదన్నారు. ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితులు లేవని అన్నారు.
Also Read : Supreme Court : ఎలోక్టరల్ బాండ్లపై సుప్రీం విచారణ
