Asaduddin Owaisi : అస‌ద్ ఎన్‌కౌంటర్..ఓవైసీ కామెంట్స్

చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా

Asaduddin Owaisi : గ్యాంగ్ స్ట‌ర్, మాజీ ఎంపీ ఆతీక్ అహ్మ‌ద్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్(UP CM). ఇటీవ‌ల అసెంబ్లీలో బ‌డ్జెట్ సంద‌ర్భంగా ప్ర‌సంగించిన సీఎం నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మాఫియాను లేకుండా చేస్తానంటూ ప్ర‌క‌టించాడు. ఆతీక్ అహ్మ‌ద్ తో పాటు సోద‌రుడిని జైలు పాలు చేశాడు.

గురువారం బీఎస్పీ ఎమ్మెల్యేను హ‌త మార్చిన ఘ‌ట‌న‌లో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో ఎమ్మెల్యే హ‌త్య కేసులో సాక్షిగా ఉన్న లాయ‌ర్ ను లేపేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఆతిక్ అహ్మ‌ద్ కొడుకు అస‌ద్ అహ్మ‌ద్ తో పాటు స‌హాయ‌కుడు గులాం ను యూపీలోని ఝాన్సీ లో ఎన్ కౌంట‌ర్ చేశారు యూపీ స్పెష‌ల్ టీం.

ఈ సంద‌ర్భంగా అస‌ద్ అహ్మ‌ద్ ను ఎన్ కౌంట‌ర్ చేయ‌డంపై తీవ్ర స్థాయిలో స్పందించారు ఎంఐఎం చీఫ్ , హైద‌రాబాద్ ఎంపీ(Asaduddin Owaisi)  అస‌దుద్దీన్ ఓవైసీ. చ‌ట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటార‌ని ప్ర‌శ్నించారు. మ‌హ‌జాబ్ పేరుతో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్ కౌంట‌ర్లు చేస్తోంద‌ని, ఇక కోర్టులు, న్యాయ‌మూర్తులు ఎందుకు అని నిల‌దీశారు ఓవైసీ.

కోర్టుల‌ను ఇక మూసేయండి..జునైద్ , న‌సీర్ ల‌నుచంపిన వారిని బీజేపీ వాళ్లు కాల్చి పారేస్తారా అంటూ ప్ర‌శ్నించారు. ఇది ఎన్ కౌంట‌ర్ కాద‌ని చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తున్నార‌ని అస‌దుద్దీన్ ఓవైసీ అన్నారు. బుల్లెట్ల‌తో న్యాయం చేస్తాన‌ని నిర్ణ‌యించుకుంటే కోర్టుల‌ను మూసేయండి అని పేర్కొన్నారు.

Also Read : 2 నెల‌ల్లో 6 న‌గ‌రాలు మార్చిన అస‌ద్

Leave A Reply

Your Email Id will not be published!