Asani Cyclone : అసని తుపాను ఎఫెక్ట్ వైజాగ్ పోర్ట్ క్లోజ్
ఏపీ, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు
Asani Cyclone : అసని తుపాను ప్రభావం దెబ్బకు ఆంధ్ర ప్రదేశ్ లోని ఉత్తర కోస్తా తో పాటు ఒడిశాలో ఈ రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఇవాళ ఏపీలోని ఓడ రేవు నగరానికి చేరుకునే అవకాశం ఉన్నందున విశాఖపట్నం ఓడ రేవు కార్యకలాపాలను నిలిపి వేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా ఇండిగో రాక పోకలు, బయలు దేరే 23 విమానాలను రద్దు చేసినట్లు వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
ప్రతికూల వాతావరణం కారణంగా నాలుగు ఎయిర్ ఏషియా విమానాలు కూడా రద్దు చేశారు. అసని తుపాను(Asani Cyclone) తూర్పు తీరానికి చచేరుకుందని , గంటకు 105 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని ఇవాళ క్రమంగా బలహీన పడే సూచనల మధ్య భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
ఏపీతో పాటు ఒడిశాలోని భువనేశ్వర్ లో సైతం తుపాన్(Asani Cyclone) ప్రభావం ఉంటుందని వెల్లడించింది. మంగళవారం ఉత్తరకోస్తా ఏపిలోని కొన్ని చోట్ల భారీ ఈనుంచి కొన్ని అతి భారీ వర్షాలు కురుస్తాయి.
రాత్రి నుండి ఒడిశా తీర ప్రాంతంలో వర్షాలు కురుస్తాయి. బంగాళా ఖాతంపై అసని ప్రభావంతో తూర్పు గాలులు వీస్తున్నందున ఇవాళ ఉత్తర భారత దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఉండవు.
అక్కడక్కడా వర్షాలు భారీగా పడనున్నాయి. ఏపీ, ఒడిశా ప్రభుత్వాలను హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల సీఎంలు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సముద్ర తీర ప్రాంతాల్లో చేపలు పట్టే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Also Read : రియాల్టీ షోలపై హైకోర్టు ఆగ్రహం