Asaram Bapu : శిష్యురాలిపై రేప్ ఆషారాంకు జీవిత ఖైదు

కోలుకోలేని షాక్ ఇచ్చిన ధ‌ర్మాస‌నం

Asaram Bapu : ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువుగా పేరొందిన ఆషారాం బాపూ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. మాజీ మ‌హిళా శిష్యురాలిపై అత్యాచారం చేసిన ఘ‌ట‌న‌కు సంబంధించిన కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇదిలా ఉండ‌గా ఆశారాం ప్ర‌స్తుతం జోధ్ పూర్ జైలులో ఉన్నారు. త‌న ఆశ్ర‌మంలో మైన‌ర్ బాలిక‌పై రేప్ చేసిన కేసులో ఇప్ప‌టికే జీవిత ఖైదు అనుభ‌విస్తున్నాడు.

2013లో మాజీ మ‌హిళా శిష్యురాలు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. త‌న‌పై ఆషారాం బాపు లైంగికంగా అత్యాచారానికి పాల్ప‌డ్డాడంటూ ఆరోపించింది. ఆపై తానే స్వ‌యంగా ఫిర్యాదు చేసింది. దీంతో కేసు న‌మోదైంది. ఈ కేసులో దోషిగా తేలారు ఆషా రాం బాపు. గుజ‌రాత్ లోన గాంధీన‌గ‌ర్ లోని కోర్టు మంగ‌ళ‌వారం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. మైన‌ర్ బాలికను రేప్ చేసిన కేసులో జీవిత ఖైదు అనుభ‌విస్తున్నాడు. ప్ర‌స్తుతం ఆషారాం బాపు(Asaram Bapu) కు 81 ఏళ్లు.

కాగా సెష‌న్స్ కోర్టు న్యాయ‌మూర్తి డీకే సోని శిక్షా ప‌రిమాణంపై వాద‌న‌లు విన్న త‌ర్వాత తీర్పు చెప్పారు. సూర‌త్ కు చెందిన ఓ మ‌హిళా శిష్యురాలు 2001 నుంచి 2006 దాకా అహ్మ‌దాబాద్ స‌మీపంలోని మోటేరాలో ని ఆషారాం బాపు ఆశ్ర‌మంలో ఉన్నారు. అనేక సంద‌ర్భాల‌లో ఆ బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డుతూ వ‌చ్చారు. 2013లో న‌మోదైన కేసులో కోర్టు ఆషా రాంను(Asaram Bapu) దోషిగా నిర్దారించింది.

సాక్ష్యాలు లేక పోవ‌డంతో ఆశారాం భార్య ల‌క్ష్మీ బెన్ , వారి కూతురు నేరానికి స‌హ‌కరించార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న న‌లుగురు శిష్యుల‌తో స‌హా మ‌రో ఆరుగురు నిందితుల‌ను కోర్టు నిర్దోషులుగా విడుద‌ల చేసింది.

Also Read : ఘ‌నంగా తెలంగాణ తమిళుల‌ ఉత్స‌వం

Leave A Reply

Your Email Id will not be published!