Ashish Mishra : ఆశిష్ మిశ్రా బెయిల్ పొడిగింపు

లఖింపూరి కేసులో నిందితుడు

Ashish Mishra : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన యూపీ లోని ల‌ఖింపూర్ లో చోటు చేసుకున్న రైతుల మృతికి సంబంధించిన కేసులో కేంద్ర మంత్రి అజ‌య్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ కుమార్ మిశ్రాకు ఊరట ల‌భించింది. ఈ మేర‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇచ్చింది. న్యాయ‌మూర్తులు సూర్య‌కాంత్ , దీపాంక‌ర్ ద‌త్తాల‌తో కూడుకున్న ధ‌ర్మాస‌నం ఈ కీల‌క తీర్పు వెలువ‌రించింది. సెప్టెంబ‌ర్ 26 వ‌ర‌కు ఎనిమిది వారాల మ‌ధ్యంత‌రం బెయిల్ ఇస్తున్న‌ట్లు పేర్కొంది.

పెండింగ్ లో ఉన్న ఇత‌ర కేసుల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంద‌ని , ట్ర‌య‌ల్ కోర్టును ఆదేశించ‌డం సాధ్యం కాద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యాన్ని గ‌త ఏప్రిల్ 24న స్ప‌ష్టం చేసింది. ఇదే కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది.

కేంద్ర స‌ర్కార్ తీసుకు వ‌చ్చిన సాగు చట్టాల‌కు వ్య‌తిరేకంగా జ‌రిగిన నిర‌స‌న‌లో ఆశిష్ మిశ్రా(Ashish Mishra) వాహ‌నం న‌డుపుకుంటూ రైతుల‌పైకి ఎక్కించాడు. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఓ జ‌ర్న‌లిస్ట్ కూడా ఉన్నాడు. యూపీ పోలీసుల ఎఫ్ఐఆర్ ప్ర‌కారం ఆశిష్ మిశ్రా న‌డుపుతున్న ఎస్ యూ వీ వేగంగా న‌డ‌ప‌డంతో న‌లుగురు రైతులు మ‌ర‌ణించార‌ని పేర్కొంది.

పోలీస్ స్టేషన్ దాటి వెళ్ల కూడ‌దంటూ ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఒక ర‌కంగా ఆశిష్ మిశ్రాకు బిగ్ షాక్ త‌గిలిన‌ట్ల‌యింది.

Also Read : ED Chief Supreme Court : ఈడీ చీఫ్ పొడిగింపు చ‌ట్ట విరుద్దం

Leave A Reply

Your Email Id will not be published!