Ashok Gehlot Pilot : ఆశించడం..కోరుకోవడం సహజం – గెహ్లాట్
సచిన్ పైలట్ కామెంట్స్ పై సీఎం స్పందన
Ashok Gehlot Pilot : రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పీఎంను ప్రశంసించినట్లు వస్తున్న వార్తలను తోసి పుచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఎప్పుడు కింగ్ పిన్ లు అవుతారో చెప్పడం కష్టమన్నారు. తాను పీఎం మోదీ ఇద్దరం కొన్నేళ్ల పాటు కలిసి సీఎంలుగా ఉన్నామని దీంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉండడంలో తప్పు లేదన్నారు.
రాజస్థాన్ పర్యటనలో భాగంగా పీఎం సీఎం అశోక్ గెహ్లాట్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఇదిలా ఉండగా సీఎం పదవిపై కన్నేసిన సచిన్ పైలట్ అశోక్ గెహ్లాట్ కోసం పార్టీని(Ashok Gehlot Pilot) ధిక్కరించిన ఎమ్మెల్యేలై చర్యలు ఎప్పుడు తీసుకుంటారంటూ ప్రశ్నించారు. కొత్తగా పార్టీ చీఫ్ గా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గేకు విన్నవించారు.
ఇది కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నెట్టుకు రాగలిగే సత్తా, అనుభవం సీఎం అశోక్ గెహ్లాట్ కు ఉంది. దీనిని ఆయన తేలికగా తీసుకున్నారు. అదే సమయంలో షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు.
సచిన్ పైలట్ తో పాటు మరికొందరికి సీఎం పదవిని ఆశించడంలో అర్హత ఉందన్నారు. దీనిలో తప్పేమీ లేదన్నారు. ప్రస్తుతానికి పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు సీఎం గెహ్లాట్. రాజకీయాల్లో ఆశయం కలిగి ఉండడం, ఆశించడం సర్వ సాధారణమైన విషయమని పేర్కొన్నారు. రాజస్తాన్ లో అంతా ప్రశాంతంగా ఉందన్నారు.
ఎలాంటి ఆందోళన అక్కర్లేదని కుండ బద్దలు కొట్టారు అశోక్ గెహ్లాట్. సీఎం చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి.
Also Read : నిన్న టీవీ జర్నలిస్ట్ నేడు సీఎం అభ్యర్థి