Ashok Gehlot : మోదీని ఢీకొనే మగాడు రాహుల్ ఒక్కడే
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కామెంట్స్
Ashok Gehlot : రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో రాచరిక పాలన సాగిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆయన నిప్పులు చెరిగారు. మోదీని ఢీకొనగలిగే సత్తా ఈ దేశంలో ఒక్కడికే ఉందని అది కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీకి మాత్రమే ఉందన్నాడు.
గత కొంత కాలంగా దేశంలో పేరొందిన నాయకులంతా ఆరోపణలు చేస్తున్నారే తప్పా ఢీకొనడం లేదని మండిపడ్డారు. కానీ మొదటి నుంచీ ప్రధాని మోదీ చేస్తున్న అరాచకాలను, బాధ్యాతా రాహిత్య పాలనను ఎత్తి చూపుతూ వస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం సీఎం అశోక్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు.
ఈ దేశం కోసం గాంధీ ఫ్యామిలీ చేసిన త్యాగం మోదీ కానీ ఆయన పరివారం కానీ ఎవరైనా చేశారా సీఎం గెహ్లాట్(Ashok Gehlot) ప్రశ్నించారు. ప్రధానమంత్రి పదవి తీసుకునే అవకాశం ఉన్నా కాదన్న ఒకే ఒక్క కుటుంబం వారిదన్నారు. కానీ బీజేపీ అదేమీ తెలుసు కోకుండా ఆరోపణలు చేస్తోందంటూ ధ్వజమెత్తారు.
ప్రజాస్వామ్యం అన్నది ఒక్క కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉందన్నారు అశోక్ గెహ్లాట్. ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున్ ఖర్గేకు అధ్యక్ష పదవిని కట్టబెట్టిన ఘనత సోనియా గాంధీ అని కొనియాడారు. ఖర్గే సారథ్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు.
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన పార్టీ చింతన్ శివర్ లో పార్టీ చీఫ్ గా ఉండాలని రాహుల్ గాంధీని(Rahul Gandhi) ఏకగ్రీవంగా కోరారని కానీ ఆయన ఒప్పు కోలేదన్నారు. గాంధీయేతర వ్యక్తి మాత్రమే పార్టీకి చీఫ్ గా ఉండాలని స్పష్టం చేశారన్నారని ప్రశంసించారు రాజస్థాన్ సీఎం.
Also Read : నోట్లపై లక్ష్మి..గణపతిలను చేర్చితే బెటర్