Ashok Gehlot Modi : మోదీ గౌర‌వించ‌డం నేర్చుకో – గెహ్లాట్

ప్ర‌ధానిపై నిప్పులు చెరిగిన సీఎం

Ashok Gehlot Modi : ఔను వాళ్లిద్ద‌రూ గొడ‌వ‌ప‌డ్డారు. మాట‌ల‌తో మంట‌లు రేపారు. కానీ అంత‌లోనే సైలెంట్ అయి పోయారు. ఇద్ద‌రూ రాజ‌కీయ ప‌రంగా అనుభవం క‌లిగిన నాయ‌కులు. వీరిలో ఒక‌రు రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాగా మ‌రొక‌రు దేశానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ.

రాజ‌స్థాన్ లో ఒకే వేదికపై సీఎం ,పీఎంలు ఆశీనుల‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేల‌పై సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) కు ప‌ట్టు లేకుండా పోయింద‌ని , ఇక రాష్ట్రాన్ని, పాల‌న ఎలా సాగిస్తారంటూ ప్ర‌శ్నించారు. ఇదే స‌మ‌యంలో ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు పీఎం. కాంగ్రెస్ పార్టీలో సీఎం గెహ్లాట్ , మాజీ డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్ మ‌ధ్య దూరం పెరిగింద‌ని, ఆ పార్టీలోనే స‌ఖ్య‌త లేన‌ప్పుడు ఇక రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారంటూ నిప్పులు చెరిగారు.

దీనిపై తీవ్రంగా స్పందించారు సీఎం అశోక్ గెహ్లాట్. ప్ర‌తిప‌క్షాల‌ను గౌర‌వించ‌డం ముందు ప్ర‌ధాన‌మంత్రి(PM Modi) నేర్చుకోవాల‌ని సూచించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఎదుటి వారిని తూల‌నాడ‌డం త‌న‌కు కూడా వ‌చ్చ‌ని, కానీ ఇది రాజ‌కీయం అనిపించుకోద‌ని స్ప‌ష్టం చేశారు. ప‌ద‌వులు శాశ్వతం కాద‌ని దానిని చూసి మురిసి పోతే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్లేన‌ని పేర్కొన్నారు. ప్ర‌తిప‌క్షం ప్రజాస్వామ్యానికి మూల స్తంభం అని గుర్తించాల‌ని స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు.

Also Read : బీజేపీ స్కెచ్ సోనియాకు చెక్

Leave A Reply

Your Email Id will not be published!