Ashok Gehlot : దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చాయి. భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా మరోసారి సత్తా చాటింది.
పవర్ లో ఉన్న యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్ , గోవాలలో తిరిగి అధికారం నిలబెట్టుకుంది. ఇక విచిత్రం ఏమిటంటే పంజాబ్ లో ఉన్న కాంగ్రెస్ తన పట్టు కోల్పోయింది.
ఇక్కడ 117 సీట్లకు గాను 92 సీట్లు చేజిక్కించుకుని అఖండ విజయాన్ని నమోదు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party). దీంతో గాంధీ ఫ్యామిలీ తప్పుకోవాలన్న డిమాండ్ పెరిగింది.
దీనికి జీ23 అసమ్మతి నేతలు తమ స్వరాన్ని ఎక్కువగా వినిపిస్తున్నారు. వారిలో ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ (Kapil Sibal) ముందంజలో ఉన్నారు.
ఆయన ఏకంగా బహిరంగంగానే గాంధీ కుటుంబం వెంటనే తమ పదవుల నుంచి స్వచ్చందంగా తప్పు కోవాలని డిమాండ్ చేశారు. వారు రాజీనామా చేసి ఇతరులకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు.
దీంతో సోనియా విధేయ వర్గం ఓ వైపు వ్యతిరేక వర్గం మరో వైపుగా చీలి పోయింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని కోలుకోకుండా చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీ యత్నిస్తోందని, దాని ట్రాప్ లో పడకండి అంటూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) విధేయుడు, సినియర్ నాయకుడు మాణిక్యం ఠాగూర్ (Manikyam Tagore) కపిల్ సిబల్ (Kapil Sibal) కు హితవు పలికారు
. తాజాగా సిబల్ వ్యవహారంపై తీవ్రంగా స్పంధించారు రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాత్(Ashok Gehlot). ఆయన ప్రముఖ న్యాయవాది కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శించేంత సీన్ , నైతిక హక్కు లేదన్నారు.
సిబల్ చేసిన దిగజారుడు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు.
Also Read : వేలుమణి ఇళ్లపై ఏసీబీ దాడులు