Ashok Gehlot : స‌చిన్ పైల‌ట్ ఎన్న‌టికీ సీఎం కాలేడు

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కామెంట్స్

Ashok Gehlot : రాజ‌స్థాన్ లో రాజ‌కీయం మ‌రింత ముదిరింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) వ‌ర్సెస్ స‌చిన్ పైలట్ గా మారి పోయింది. ఇదే స‌మ‌యంలో రాహుల్ గాంధీ చేప‌ట్ట‌ని భార‌త్ జోడో యాత్ర‌ను అడ్డుకుంటామంటూ బైంస్లా కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

దీని వెనుక ఎవ‌రు ఉన్నార‌నేది ప్ర‌తి ఒక్క‌రికి తెలుస‌న్నారు సీఎం. గురువారం అశోక్ గెహ్లాట్ జాతీయ మీడియాతో మాట్లాడారు. సీఎం పోస్టుపై క‌న్నేసిన స‌చిన్ పైల‌ట్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడే కాదు ఇంకెప్ప‌టికీ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి కాలేడ‌న్నారు. పార్టీకి తీర‌ని ద్రోహం తల‌పెట్టాడంటూ ధ్వ‌జ‌మెత్తారు.

పార్టీ హైకమాండ్ ఆయ‌న వైపు ఉంటుందని తాను అనుకోవ‌డం లేద‌న్నారు అశోక్ గెహ్లాట్. కేవ‌లం 10 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తుతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం అసాధ్య‌మ‌న్నారు సీఎం. పార్టీలో ఉంటూ వెన్ను పోటు పొడిచే స‌చిన్ పైల‌ట్ లాంటి వాళ్లు ఎంద‌రున్నా త‌న‌ను ఏమీ చేయ‌లేర‌న్నారు.

ఆయ‌న భార‌తీయ జ‌నతా పార్టీని ప్ర‌ధానంగా ట్ర‌బుల్ షూట‌ర్ , కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను టార్గెట్ చేశారు. షా స‌పోర్ట్ తోనే స‌చిన్ పైల‌ట్ ఈ నాట‌కానికి తెర లేపాడంటూ ధ్వ‌జ‌మెత్తారు అశోక్ గెహ్లాట్.

తాను ఉన‌నంత వ‌ర‌కు స‌చిన్ పైలట్ ఆట‌లు సాగ‌వ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌స్తుతం పైల‌ట్ వ‌య‌స్సు 45 నా వయ‌స్సు 26 ఏళ్లు ఎక్కువ‌. ఆయ‌న‌కంటే ముందు రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని త‌న‌ను ఎదుర్కోవ‌డం ఎవ‌రి త‌రం కాద‌న్నారు గెహ్లాట్.

Also Read : గాల్వాన్ ట్వీట్ త‌ప్పైంది..మ‌న్నించండి

Leave A Reply

Your Email Id will not be published!