Ashwini Vaishnaw : టెలికాం కంపెనీల‌కు కేంద్రం ఖుష్ క‌బ‌ర్

5జి స్పెక్ట్ర‌మ్ వేలం పాట పూర్తి

Ashwini Vaishnaw : ఇప్ప‌టి దాకా 4జి స‌ర్వీస్ వ‌ర‌కే ప‌రిమిత‌మైన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్ర‌భుత్వం. ఇప్ప‌టికే 5జి స్పెక్ట్ర‌మ్ వేలం పూర్త‌యింద‌ని, వెంట‌నే టెలికాం కంపెనీలు స‌ర్వీసులు అందించేందుకు సిద్దం కావాల‌ని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్(Ashwini Vaishnaw ) పిలుపునిచ్చారు.

ఇందుకు సంబంధించి టెలికాం శాఖ స్పెక్ట్ర‌మ్ కేటాయింపు లేఖ‌లు కూడా జారీ చేసింది. తాజాగా ఎయిర్ టెల్ కు లేఖ అంద‌డంపై స్పందిస్తూ సంతోషం వ్య‌క్తం చేశారు సంస్థ చైర్మ‌న్ సునీల్ మిట్ట‌ల్.

దీంతో టెలికాం సేవ‌ల సంస్థ‌ల‌ను లాంచ్ చేసేందుకు సిద్దం కావాల‌ని వైష్ణ‌వ్ గురువారం వెల్ల‌డించారు. ఈ మేర‌కు కూ లో పోస్ట్ చేశారు. ఈ మేర‌కు ధ్రువీక‌రించారు.

భారీ ఎయిర్ టెల్ టెలికాం శాఖ‌కు ముంద‌స్తుగా చెల్లించిన కొద్ది గంట‌ల‌కే స్పెక్ట్ర‌మ్ వాటాను కేటాయిస్తూ లేఖలు అందాయ‌ని ఆయా సంస్థ‌లు వెల్ల‌డించాయి.

ఇదిలా ఉండ‌గా డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం (డాట్ ) ముంద‌స్తు చెల్లింపు చేసిన రోజున స్పెక్ట్ర‌మ్ కేటాయింపు లేఖ‌ను అంద‌జేయ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం.

కాగా ఎయిర్ టెల్ స్పెక్ట్రమ్ బ‌కాయిల కోసం రూ. 8,312 కోట్లు చెల్లించింది. నిర్ణీత ఫ్రీక్వెన్సీ బ్యాండుల కోసం గంట‌ల వ్య‌వ‌ధిలో కేటాయింపు లేఖ అందించింది.

ఎలాంటి పైర‌వీలు లేవు. కారిడార్ల చుట్టూ ప‌రుగెత్త‌డం లేదు. వ్యాపారం మ‌రింత సుల‌భ‌త‌రం కావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు మిట్ట‌ల్. స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు భార‌తీ ఎయిర్ టెల్ , రిల‌య‌న్స్ జియో, అదానీ డేటా నెట్ వ‌ర్క్స్ , వొడా ఫోన్ ఐడియా రూ. 17,876 కోట్లు చెల్లించాయి.

Also Read : గూగుల్ వార్నింగ్ ఆపిల్ బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!