Ashwini Vaishnaw Railway Lines : ఏడాది చివరి నాటికి కాశ్మీర్‌కు రైల్వే లైన్లు
Ashwini Vaishnaw Railway Lines : కాశ్మీర్ లోయను భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే రైలు మార్గాన్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా పలు ప్రత్యేక ‘వందే భారత్’ రైళ్లు నడపనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
సోపోర్-కుప్వారా, అవంతిపోరా-షోపియాన్, బిజ్‌బెహరా-పహల్గాం అనే మూడు ప్రాంతాలను రైల్వే లైన్‌తో(Ashwini Vaishnaw Railway Lines) అనుసంధానం చేయాలనే డిమాండ్ వచ్చిందని, ఈ విషయమై తమ మంత్రిత్వ శాఖ చర్చిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.
అలాగే దేశవ్యాప్తంగా 146 గతి శక్తి కార్గో టెర్మినల్స్‌ను నిర్మిస్తున్నామని, బనిహాల్ నుంచి బారాముల్లా వరకు రైల్వే లైన్‌లో కనీసం నాలుగు టెర్మినల్స్‌ను కలిగి ఉండాలని, కశ్మీర్‌లోని హస్తకళలు, జిప్సమ్‌తో సహా వ్యాపారాన్ని మరియు ఉత్పత్తులను పెంచుతుందని మంత్రి అన్నారు.
Also Read : 36 ఉపగ్రహాలతో LVM3 రాకెట్ విజయవంతం