Asia Cup 2023 : ఆసియా క‌ప్ యుద్దానికి సిద్దం

పాల్గొంటున్న ఆరు జ‌ట్లు

Asia Cup 2023 : ఆసియా క‌ప్ క్రికెట్ టోర్నీ ప్రారంభానికి సిద్దమైంది. ఆగ‌స్టు 30 బుధ‌వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది జ‌రిగే ఈ టోర్నీలో ఆరు జ‌ట్లు పాల్గొంటున్నాయి. ఈ జ‌ట్ల‌లో ఇండియా(India), పాకిస్తాన్, శ్రీ‌లంక‌, నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్గ‌నిస్తాన్ జ‌ట్లు ఆడ‌బోతున్నాయి. ఇంకా శ్రీ‌లంక జ‌ట్టును ఖ‌రారు చేయ‌లేదు.

ఈ టోర్నీ హైబ్రిడ్ ఫార్మాట్ లో కొన‌సాగుతోంది. నాలుగు మ్యాచ్ లు పాకిస్తాన్ లో ,9 మ్యాచ్ లు శ్రీ‌లంక‌లో జ‌ర‌గనున్నాయి. కొలంబోలో ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Asia Cup 2023 will Start on 30th August

ఇక జ‌ట్ల ప‌రంగా చూస్తే ఆఫ్గ‌నిస్తాన్ జ‌ట్టుకు హష్మతుల్లా షాహిదీ కెప్టెన్ కాగా రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, రషీద్ ఖాన్, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, అబ్దుల్ రెహమాన్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్ సఫీ, ఫజల్హక్ ఫారూఖీ ఆడ‌తారు.

బంగ్లాదేశ్ జ‌ట్టుకు షకీబ్ అల్ హసన్ కెప్టెన్ గా ఉండ‌గా లిట్టన్ కుమార్ దాస్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్ ధృబో, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షొరిఫుల్ హమీద్, షొరిఫుల్ ఇస్లాం, నసుమ్ , షమీమ్ హొస్సేన్, తంజిద్ హసన్ తమీమ్, తంజిమ్ హసన్ సాకిబ్ ఉన్నారు.

పాకిస్తాన్ టీమ్ కు బాబ‌ర్ ఆజ‌మ్ స్కిప్ప‌ర్ గా ఉంటారు. అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ అలీ అఘా, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హారీస్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, ఫహీమ్ అష్రఫ్, హరీస్ రవూఫ్, మహ్మద్, వసీమ్ జె నసీమ్ షా, షాహీన్ అఫ్రిది, సౌద్ షకీల్ ఆడ‌నున్నారు. రిజ‌ర్వ్ ఆట‌గాడిగా తాహిర్ ఆడ‌తారు.

భార‌త(India) జ‌ట్టు ప‌రంగా చూస్తే రోహిత్ శ‌ర్మ కెప్టెన్ కాగా విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రాజ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ , కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆడ‌తారు. రిజ‌ర్వ్ ఆట‌గాడిగా కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ ను ఎంపిక చేసింది బీసీసీఐ(BCCI).

నేపాల్ జ‌ట్టు ప‌రంగా చూస్తే రోహిత్ పౌడెల్ నాయ‌క‌త్వం వ‌హిస్తారు. కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, భీమ్ షర్కి, కుశాల్ మల్లా, ఆరిఫ్ షేక్, దీపేంద్ర సింగ్ ఐరీ, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, కరణ్ కెసి, సందీప్ లామిచానే, లలిత్ రాజ్‌బన్షి, ప్రతిష్ జిసి, మౌసమ్ ధాకల్, సందీప్ జోరా మహతో, అర్జున్ సౌద్ ఆడ‌తారు.

శ్రీ‌లంక జ‌ట్టులో ధ‌నంజ‌య డిసిల్వ‌, హంబ‌న్ , దుష‌న్ హేమంత‌, దినేష్ చండిమాల్, దాసున్ శ‌నుక‌, నెగొంబో, వానిందు హ‌స‌రంగా, ల‌హిరు కుమార‌, క‌సున్ ర‌జిత‌, మాత‌ర‌, ప్ర‌వీణ్ జ‌య విక్ర‌మ‌, ధ‌నుష్క గుణ‌తిల‌క‌, పాణ‌దుర‌, దుష్మంత చ‌మీర‌, రాగ‌మ‌, చ‌మిక క‌రుణ ర‌త్నే, పాతుమ్ నిస్సాంక‌, కుసాల్ మెండీస్, స‌దీర స‌మర విక్ర‌మ‌, మ‌తీష ప‌తిర‌ణ‌, చ‌రిత్ అస‌లంక‌, మ‌హేశ్ తీక్ష‌ణ ఆడ‌తారు.

Also Read : MLA Raja Singh : తెలంగాణ‌ను హిందూ రాష్ట్రం చేస్తా

Leave A Reply

Your Email Id will not be published!