Asle Toje Denies : మోదీ గురించి అలా అనలేదు
నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్
Asle Toje Denies : శాంతి బహుమతికి నరేంద్ర మోడీ అతి పెద్ద పోటీదారుగా ఉన్నారంటూ వస్తున్న వార్తలను, కథనాలను నార్వేజియన్ నోబెల్ కమిటీ ఉప నాయకుడు అస్లే టోజే(Asle Toje Denies) తోసిపుచ్చారు. ఇది యుద్ద యుగం కాదు అని రష్యా చీఫ్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను గుర్తు చేశారు. కొన్ని టీవీ ఛానళ్లు భారత పర్యటన సందర్భంగా టోజే నోబెల్ శాంతి బహుమతికి పెద్ద పోటీదారు అని పీఎం మోడీని సూచించారని ఇప్పుడు వైరల్ చేసిన ట్వీట్ కు వివరణ ఇచ్చు కోవాల్సి వచ్చింది.
అస్లే టోజే జాతీయ మీడియా ఏఎన్ఐతో మాట్లాడారు. తాను గౌరవమైనీయమైన కమిటీకి డిప్యూటీ లీడర్ గా కాకుండా ఇంటర్నేషనల్ పీస్ అండ్ అండర్ స్టాండింగ్ డైరెక్టర్ గా , ఇండియా సెంటర్ ఫౌండేషన్ (ఐసీఎఫ్) స్నేహితుడిగా భారత దేశంలో ఉన్నానని చెప్పారు. ఇదంతా అబద్దమని , దీనిని ఫేక్ న్యూస్ గా పరిగణించాలని కోరారు. నేను నార్వేజియన్ నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ గా ఇండియాలో లేనన్నారు.
అంతర్జాతీయ శాంతి , అవగాహన డైరెక్టర్ గా , ఇండియా సెంటర్ ఫౌండేషన్ స్నేహితునిగా మాత్రమే ఇక్కడ ఉన్నానని స్పష్టం చేశారు అస్లే టోజే(Asle Toje). ఇదిలా ఉండగా ఇండియా సెంటర్ ఫౌండేషన్ ఢిల్లీకి చెందిన లాభాపేక్ష లేని సంస్థ. రాజకీయాలు , అభివృద్ది గురించి మాట్లాడేందుకు మాత్రమే తాను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇది యుద్ద యుగం కాదు అని చెప్పినందుకు ప్రధాని మోదీని టోజే ప్రశంసించారు. మొత్తంగా నరేంద్ర మోదీకి నోబెల్ శాంతి బహుమతి అనేది అబద్దమని టోజే వివరణతో క్లారిటీ వచ్చేసింది.
Also Read : ఏంపీని నోరు మూసుకోమంటే ఎలా