Assam CM : పీపీఇ కిట్ వ్య‌వ‌హారం సీఎం ఆగ్ర‌హం

అర‌వింద్ కేజ్రీవాల్ పై కామెంట్స్

Assam CM :  పీపీఇ కిట్ వ్య‌వ‌హారం తీవ్ర దుమారం రేపుతోంది. అస్సాం సీఎం(Assam CM) పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. దీంతో బీజేపీ, ఆప్ మ‌ధ్య మాట‌ల యుద్దం మొద‌లైంది.

ఈ త‌రుణఃలో తాజాగా అస్సాం సీఎం హిమంత బిస్వ శ‌ర్మ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేశారు. ఎక్క‌డి నుంచైనా పీపీఇ కిట్ లు కొనుగోలు చేయొచ్చంటూ గ‌తంలో ఢిల్లీ చేసిన ట్వీట్ ను ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

మ‌రి సీఎంను కూడా అవినీతి ప‌రుడ‌ని అనుకోవాలా అంటూ సిసోడియాను ప్ర‌శ్నించారు అస్సాం సీఎం. ఇదిలా ఉండ‌గా హిమంత బిస్వా శ‌ర్మ త‌న భార్య రినికి భుయాన్ శ‌ర్మ‌కు కాంట్రాక్టు ఇచ్చార‌ని ఆరోపించారు సిసోడియా.

ఈ కామెంట్స్ అటు బీజేపిలో ఇటు అస్సాం రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపాయి. ఈ దాడుల‌ను తిప్పి కొట్టారు సీఎం. తాము ఎలాంటి అక్రమాల‌కు పాల్ప‌డ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

అవినీతి అన్న‌ది ఎక్క‌డా జ‌ర‌గ‌లేద‌ని, కావాల‌ని దుష్ప్ర‌చారం చేసేందుకు ఇలా ఆధారాలు లేకుండా విమ‌ర్శ‌లు చేశారంటూ మండిప‌డ్డారు బిస్వా శ‌ర్మ‌.

2020లో ఎంపీగా గెలిచిన గౌత‌మ్ గంభీర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా పీపీఇని ఎక్క‌డికి నుంచి కొనుగోలు చేస్తార‌ని ప్ర‌శ్నించారు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ను. దీనికి ఆనాడు స్పందిస్తూ ఢిల్లీ సీఎం  రీట్వీట్ చేశారు.

పీపీఇ కిట్ల‌ను టెండ‌ర్ లేకుండా ఎక్కడి నుంచైనా కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని సీఎం వెల్ల‌డించార‌ని, మ‌రి దీని వెనుక అవినీతి చోటు చేసుకుందా అని అస్సాం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ ప్ర‌శ్నించారు.

Also Read : యూపీ ఫ్యాక్ట‌రీలో పేలుడు 13 మంది మృతి

Leave A Reply

Your Email Id will not be published!