Assam Floods : అసోంలో వరదల బీభత్సం
ఆరు జిల్లాల్లో భారీ ప్రభావం
Assam Floods : అసోంలో వరదల బీభత్సం ఇబ్బందికి గురి చేస్తోంది. వర్షాల దెబ్బకు కొండ చరియలు విరిగి పడ్డాయి. భారీగా కురుస్తున్న కుంభవృష్ఖి కారణంగా ఆరు జిల్లాల్లో వరదలు పోటెత్తాయి.
వరదల ఉధృతికి 94 గ్రామాలు నీట మునిగాయి. 24 వేల మందికి పైగా వరదల్లో చిక్కుకున్నారు. పలు చోట్ల రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటి వరకు అధికారిక సమాచారం మేరకు ముగ్గురు మరణించారు.
ఒక్కసారిగా వరదలు పోటెత్తడంతో పలు చోట్ల రోడ్లు కొట్టుకు పోయాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల(Assam Floods) దెబ్బకు రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగి పోయాయి.
పరిస్థితి దయనీయంగా ఉంది. సహాయక చర్యలు చేపట్టేందుకు డిజాస్టర్ మేనేజ్ మెంట్ రంగంలోకి దిగింది. అసోం(Assam Floods) రాష్ట్రంలోని కాచర్ , ధెమాజీ, హొజాయ్ , కర్బి అంగ్లాంగ్ వెస్ట్ , నాగౌన్ , కంరూప్ జిల్లాలను వరదలు ముంచెత్తాయని అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది.
ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల డిమా హసావో జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడ్డాయి. అస్సాం తో పాటు పొరుగున ఉన్న అరుణాచల్ ప్రదేశ్ , మేఘాలయలో గత రెండు రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.
అనేక నదుల నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. కొపిలి నదిలో నీరు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. వరద ప్రభావిత జిల్లాల్లో 1732.72 హెక్టార్ల పంట భూములు నీట మునిగాయి.
పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు సీఎం.
Also Read : కేజ్రీవాల్ ను ప్రశ్నించడం ఆపను