Assembly Election 2022 : ముగిసిన ఎన్నిక‌ల ప‌ర్వం

ఫ‌లితాల‌పై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ

Assembly Election 2022 : దేశంలోని ఐదు రాష్ట్రాల‌కు సంబంధించి ఎన్నిక‌ల ప‌ర్వం ముగిసింది. ఇప్ప‌టికే ఉత్త‌రాఖండ్, మ‌ణిపూర్ , గోవా, పంజాబ్ , ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో ఇవాల్టితో పోలింగ్ పూర్త‌యింది.

ఈ ఎన్నిక‌ల‌ను కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ రెఫ‌రెండమ్ గా భావిస్తోంది. ఈ విష‌యాన్ని దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌క‌టించారు. ఎక్కువ నియోజ‌క‌వ‌ర్గాలు క‌లిగిన యూపీలో ప‌వ‌ర్ లో ఉన్న బీజేపీకి ఈ ఎన్నిక‌లు స‌వాల్ గా మారాయి.

ఇక మొత్తంగా చూస్తే చిన్న చిన్న ఘ‌ట‌న‌లు మిన‌హా ఐదు రాష్ట్రాల పోలింగ్ ప్ర‌శాంతంగానే ముగిశాయి. ఇవాల్టితో యూపీలో ఏడో విడ‌త పోలింగ్ ముగిసింది. దీంతో మొత్తం పోలింగ్ ప్ర‌క్రియ‌కు పుల్ స్టాప్ ప‌డింది.

ఆయా ఐదు రాష్ట్రాల‌కు సంబంధించిన ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈనెల 10న విడుద‌ల చేయ‌నుంది భార‌త ఎన్నిక‌ల సంఘం. ఆరోజు మ‌ధ్యాహ్నం వ‌ర‌కు పూర్తి రిజ‌ల్ట్స్ రానున్నాయి.

ఈ ఏడాది జ‌న‌వ‌రి 8న సీఈసీ పోలింగ్ షెడ్యూల్ డిక్లేర్ చేసింది. ఐదు రాష్ట్రాల‌కు సంబంధించి 690 సీట్లు ఉన్నాయి. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్త‌ర ప్ర‌దేశ్ లో 403 సీట్లు ఉండ‌గా మ‌ణిపూర్ లో 28 స్థానాలు, గోవాలో 40 స్థానాలు, పంజాబ్ లో 117 స్థానాలు, ఉత్త‌రాఖండ్ లో 70 స్థానాల్లో ఎన్నిక‌లు జ‌రిగాయి.

ఇదిలా ఉండ‌గా పంజాబ్, ఉత్త‌రాఖండ్ , గోవా రాష్ట్రాలలో(Assembly Election 2022 ) ఒకే ద‌శ‌లో పోలింగ్ జ‌రిగింది. యూపీలో మాత్రం స్థానాలు ఎక్కువ‌గా ఉండ‌డంతో ఏడు ద‌శ‌ల్లో ఎన్నిక‌ల సంఘం పోలింగ్ చేప‌ట్టింది.

ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై అన్ని పార్టీలు ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాయి. ఫ‌లితాలు వ‌స్తే కానీ ఎవ‌రి వైపు ప్ర‌జ‌లు మొగ్గు చూపార‌నేది తేలనుంది.

Also Read : భార‌త రాయ‌బారి అనుమానాస్ప‌ద మృతి

Leave A Reply

Your Email Id will not be published!